
Today Horoscope May 26 Telugu: ఈ రోజు రాశి ఫలాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 మే 26వ తేదీ, మంగళవారం. పండితుల ప్రకారం ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి? ఏ రాశులు దూర ప్ర... Today Horoscope May 26 Telugu: ఈ రోజు రాశి ఫలాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 మే 26వ తేదీ, మంగళవారం. పండితుల ప్రకారం ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి? ఏ రాశులు దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు మొదలవుతాయి. అంతేకాదు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. మిథున రాశి వారికి కూడా ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాదు ఆకస్మిక ధన లాభం కూడా ఉంది. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కలిసి రావడంతో పాటు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. సింహరాశి వారికి ఈరోజు మామూలుగా ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకండి, ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సింహ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కోపం తెచ్చుకోకండి. ధనస్సు రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. ధనస్సు రాశి వారు ఈ రోజు ప్రయాణాలు చేస్తే అవి ఆర్థికంగా కలిసి వస్తాయి. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందే రోజు. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కోపం తగ్గించుకోవడం మంచిది. పెద్దల సూచనలతో నడుచుకోవాలి. లేకపోతే ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సా ధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)