
LIC New Jeevan Sathi: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. భార్యాభర్తల కోసం రెండు ఉమ్మడి జీవిత బీమా పథకాలను ఆవిష్కరించింది. ఎల్ఐసీ న్యూజీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన... LIC New Jeevan Sathi: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. భార్యాభర్తల కోసం రెండు ఉమ్మడి జీవిత బీమా పథకాలను ఆవిష్కరించింది. ఎల్ఐసీ న్యూజీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం ఈ రెండు స్కీములను తీసుకువచ్చింది. ఈ పథకాలు ప్రత్యేకంగా జంటల కోసం రూపొందించినట్లు ఎల్ఐసీ పేర్కొంది. ఈ రెండు స్కీములు కూడా భార్యాభర్తలిద్దరూ ఒకే పాలసీ కింద జీవిత బీమా కవరేజీ, పొదుపు ప్రయోజనాలను పొందే వీలుంటుంది. ఈ రోజుల్లో ప్రజలు కేవలం పెట్టుబడులనే కాకుండా సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటున్నారు. కాబట్టి ఎల్ఐసీ తీసుకువచ్చిన ఈ రెండు పాలసీలు కూడా ఎన్నో ప్రయోజనాలను అందించనున్నాయి. ఈ స్కీముల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భార్యాభర్తల కోసం రెండు సరికొత్త ఉమ్మడి జీవిత బీమా పాలసీలను తీసుకువచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. న్యూ జీవన్ సాథీ పేరుతో ఈ స్కీమును ఆవిష్కరించింది. దీనిని ఏ ప్రీమియంతో అంటే సింగిల్, లిమిటెడ్ ప్రీమియంతో తీసుకునేందుకు వీలుంటుంది. ఈ పాలసీ ద్వారా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకేపాలసీ కింద ఆర్థిక భద్రతతో పాటు పొదుపు ప్రయోజనాలను కూడా అందుకుంటారు. ఈ రెండు పథకాలు కూడా జూన్ 1, 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి. జీవిత భాగస్వాములు ఇద్దరూ ఒకే పాలసీ కింద ఉమ్మడి బీమా రక్షణ కల్పిస్తుంది. పాలసీ వ్యవధిలో ప్రతి రూ. 1000 ప్రాథమిక పాలసీ విలువపై రూ. 70 చెప్పు గ్యారెంటీ అడిషన్ లభిస్తుంది. పాలసీ వ్యవధిని మీ అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. గడువు తీరిన తర్వాత లేదా పాలసీదారుల్లో ఒకరు మరణించిన సందర్భంలో పాలసీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదాల రూపంలో పొందే సదుపాయం కూడా ఉంటుంది. పాలసీ నుంచి లోన్ కూడా తీసుకునే వెలుసుబాటు కల్పించింది అదనపు ప్రీమియం చెల్లించి, అనుబంధ పాలసీలను ఎంచుకోవడం ద్వారా బీమా రక్షణను పెంచుకోవచ్చు. న్యూ జీవన్ సాథీ దీనికి పరిమిత కాలంతోపాటు ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించే వ్యవధిలో భార్యాభర్తల్లో ఎవరైనా మరణిస్తే ..భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియం నుంచి మినహాయింపు ఉంటుంది. పాలసీ వ్యవధి పొడవునా చెల్లించిన మొత్తం కూడా వార్షిక ప్రీమియంపై 7శాతం చొప్పున గ్యారెంటీ అడిషన్ అందిస్తుంది. ప్రీమియం చెల్లింపు, పాలసీ వ్యవధిని ఎంచుకునే స్వేచ్ఛ కూడా పాలసీదారులకు ఉంటుంది. కాగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఎల్ఐసీ లాభం గత ఏడాదితో పోలిస్తే 23.1శాతం పెరిగి రూ. 23,420 కోట్లకు చేరింది. కంపెనీ నికర ప్రీమియం ఆదాయం కూడా 11.6శాతం పెరిగి రూ. 1.7లక్షల కోట్లకు చేరుకుంది.