
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించ... మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Crorepati Govt Scheme: మన దేశంలో పోస్టాఫీస్ అంటే కేవలం సమాచారం చేరవేసే సంస్థ మాత్రమే కాకుండా ప్రజలకు పొదుపు అలవాటు చేసే ఒక వ్యవస్థగా కూడా మారింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి విషయాలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఊరిలో ఉంటుందనే భరోసా, కళ్ల ముందే కనిపించే ఉద్యోగులు, ఎప్పుడైనా వెళ్లే వెసులుబాటు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలుకూడా పోస్టాఫీస్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న భారతీయ పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన సులభమైన పొదుపు పథకాలను తీసుకువస్తోంది. ఇప్పుడు చెప్పుకోబోయే పథకం కూడా అలాంటిదే. పోస్టాఫీసు స్కీములు సురక్షితమైన పెట్టుబడి, అద్భుతమైన రాబడుల కారణంగా బాగా ప్రాచుర్యం పొందాయి. అలాంటి స్కీముల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఇది పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసే స్కీమ్. ఇందులో పెట్టుబడి పన్ను మినహాయింపులు, క్రమం తప్పని పెట్టుబడుల తర్వాత మెచ్యూరిటీ రాబడిపై పన్ను లేకపోవడం వంటి అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. నెలకు రూ. 12,500 పొదుపుతో రూ. 1కోటీకిపైగా నిధిని కూడబెట్టుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వ స్కీమ్ మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది. సురక్షితమైన పెట్టబడి సాధనాల విషయానికి వస్తే పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు ముందు వరుసలో ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి పెట్టుబడి భద్రతకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విషయానికి వస్తే.. ఈ స్కీమ్ ప్రభుత్వ రక్షణను అందించడమే కాదు.. పన్ను రహితమైన భారీ మెచ్యూరిటీ కార్పస్ కూడా అందిస్తుంది. ఈ స్కీమ్ కు ఉన్న అనేక ప్రయోజనాల వల్ల ఈ పథకం బాగా ప్రాచుర్యం పొందింది. Also Read: ఒకే పాలసీ.. భార్యాభర్తలిద్దరికీ కోట్లలో కవరేజ్.. ఎల్ఐసీ కొత్త స్కీమ్ డీటెయిల్స్ ఇవే! పీపీఎఫ్ వడ్డీ రేట్లను చూస్తే.. పోస్టాఫీస్ ద్వారా నిర్వహించే ఈ ప్రభుత్వ స్కీమ్ రూ. 7.1శాతం వడ్డీ రేటును అందిస్తుంది. పీపీఎఫ్ ఖాతా నిబంధనల ప్రకారం డిపాజిట్లపై వడ్డీని ప్రతినెలా 5వ తేదీ నుంచి చివరి తేదీ వరకు లెక్కిస్తారు. అందువల్ల మీరు ఏ నెలలోనైనా 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య మీ పీపీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేస్తే మీకు ఆ నెల వడ్డీ అందుతుంది. పీపీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేసిన తర్వాత మెచ్యూరిటీ 15ఏళ్లు ఉంటుంది. అయితే ఈ స్కీమ్ కింద దీనిని 5-5 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పెట్టుబడిదారులు పెద్ద నిధిని స్రుష్టించుకోవచ్చు. ఈ ప్రభుత్వ స్కీములో పెట్టుబడి మొత్తం పరిమితి.. ఏడాదికి గరిష్టంగా రూ. 1.50లక్షలు అంటే మీరు ప్రతినెలా రూ. 12,500 పెట్టుబడి పెట్టవచ్చు. మీరు రూ. 1.5లక్షల 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మరో 5ఏళ్లు పొడిగించినట్లయితే మీకు వడ్డీ 36.58లక్షలు వస్తుంది. అసలు 66.58లక్షలు లభిస్తాయి. 25ఏళ్ల తర్వాత మరో 5ఏళ్లు పొడిగిస్తే ఈ మొత్తంపై మీకు వడ్డీగా రూ. 68.58లక్షల లభిస్తాయి. అదే సమయంలో మొత్తం అసలు కలిపి రూ. 1.03కోట్లు ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టింది కేవలం రూ. 37.50లక్షలు మాత్రమే. వడ్డీ రూపంలోనే 68.58లక్షల వరకు అందుకుంటారు. Also Read: నెలకు రూ. 2వేల పొదుపు.. 30ఏళ్లలోనే కోటీశ్వరులు Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్