
ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ముందు జాగ్రత్తగా రకరకాల పరీక్షలు చేయించుకోవటం ఇప్పుడు ఎక్కువైంది. అయితే వీటిని సరిగా చేయించుకోవటమూ కీలకమే. అలాంటి కొన్ని పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిగో.. పెద్దవయసువారికి రక్తపోటు క... పెద్దవయసువారికి రక్తపోటు కాస్త ఎక్కువున్నా పర్వాలేదనుకోవద్దు. ఎవరికైనా 120/80 నార్మల్. 130/90 దాటితే మందులు వేసుకోవాల్సిందే. కాకపోతే వరుసగా మూడు వేర్వేరు రోజుల్లో రక్తపోటును పరీక్షించుకోవాలి. అన్నిసార్లూ 130/90 మించితేనే మందులు ఆరంభించాలి. ఇంటివద్దే, అదీ ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు.. సాధారణంగా ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు రక్తపోటు పరీక్షించుకోవటం మంచిది. మాత్రలు వాడుతుంటే యథావిధిగా వేసుకుంటూనే రక్తపోటు కొలుచుకోవాలి. మనదేశంలో గుండెజబ్బులకు ముఖ్య కారణం చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్). అయితే చాలామంది దీన్ని పట్టించుకోరు. ఎక్కువున్నా ఏమీ కాదని భావిస్తుంటారు. ఇది తగదు. సాధారణంగా ఎల్డీఎల్ 100 లోపు ఉండాలి. మధుమేహం వంటి సమస్యలు గలవారైతే 70 లోపే ఉంచుకోవాలి. డాక్టర్లు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు సూచిస్తే విధిగా వేసుకోవాలి. మధ్యలో ఆపేయొద్దు. వీటిని వాడుతున్నప్పుడు రక్త పరీక్షలో ఎల్డీఎల్ తగ్గినట్టు తేలితే, అది మందుల ప్రభావంతోనేనని గుర్తించాలి. ఇది అతి సున్నితమైన పరీక్ష. శరీరంలో ఎక్కడ కొద్దిగా వాపుప్రక్రియ, ఇన్ఫెక్షన్ ఉన్నా దీని మోతాదులు పెరుగుతాయి. ఇది గుండెపోటు ముప్పునకు సూచిక కావొచ్చని ఫలితాల్లో రాస్తుంటారు. దీన్ని అందరికీ వర్తించటం తగదు. గుండెపోటు ముప్పు కారకాలు ఎక్కువగా గలవారికి, అప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారికి హెచ్ఎస్సీఆర్పీ పెరిగితే మరోసారి ప్రమాదం పొంచి ఉందని అర్థం. ఆరోగ్యంగా ఉన్నవారు, 40 ఏళ్లలోపు వారికిది పెరిగినా పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది రకరకాల సమస్యల్లో పెరుగుతుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.