
Home » Andhra Pradesh » Ananthapuram » Topudurthi Raja Reddy Detained in Maheshwar Reddy Death Case VK ABN , Publish Date - May 26 , 2026 | 08:47 AM రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి... రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో తోపుదుర్తి మహేశ్వరరెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. అనంతపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో తోపుదుర్తి మహేశ్వరరెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, మహేశ్వరరెడ్డిని తోపుదుర్తి సోదరులే హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.తోపుదుర్తి రాజారెడ్డిపై ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు మహేశ్వర రెడ్డి తండ్రి మల్లారెడ్డి. గత సంవత్సరం అనంతపురం రూరల్ మండలంలోని తాటిచెర్ల తోపుదుర్తి రాజారెడ్డి, తోపుదుర్తి చందు బెదిరించి తమ కొడుకు మహేశ్వర్‌రెడ్డిని హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మల్లారెడ్డి. పోలీసులు పట్టించుకోలేదంటూ ఎస్పీ జగదీశ్‌తో అవేదన వ్యక్తం చేశారు మహేశ్వర రెడ్డి తండ్రి మల్లారెడ్డి. ఆధారాలు ఇచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు రావడంతో తోపుదుర్తి సోదరులపై కేసు నమోదు చేశారు అనంతపురం రూరల్ పోలీసులు. మహేశ్వర్ రెడ్డిని బెదిరించిన కేసులో తోపుదుర్తి సోదరులతో పాటు తోపుదుర్తి గ్రామానికి చెందిన మరో ఐదుగురు ప్రమేయం ఉందని మల్లారెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తోపుదుర్తి రాజారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.