
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు... అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Student Ribs Mumbai Indians: ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఓ విద్యార్థి చేసిన స్పీచ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనపై అతడు చాలా ఫన్నీగా మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతా అంబానీ ఆ విద్యార్థి మాటలకు నవ్వుకున్నారు. గ్రాడ్యుయేషన్ తరువాతి లైఫ్ గురించి సదరు విద్యార్థి మాట్లాడుతూ.. మనకు ఇష్టమైన ముంబై ఇండియన్స్ జట్టు మాదిరిగానే జీవితంలోనూ కొన్నిసార్లు కఠినమైన సీజన్లు ఉంటాయని అన్నాడు. ఆ విద్యార్థి ఈ మాట చెప్పిన వెంటనే ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోయింది. పాఠశాల వ్యవస్థాపకురాలు, ముంబై ఇండియన్స్ ఓనర్ అయిన నీతా అంబానీ అతడి మాటలకు నవ్వుతూ ముఖాన్ని చేతుల్లో కప్పుకోవడం కనిపించింది. ఆ విద్యార్థి తన మాటలను కొనసాగిస్తూ.. ఈ ఫ్రాంచైజీ మనందరికీ నేర్పిన ఒక విషయం ఏమిటంటే.. మీరు ఎవరో ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ వారసత్వాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు.. మీకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు అని అన్నాడు. చివరగా ఆ విద్యార్థి “ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి దునియా హిలా దేంగే హమ్” అనే ముంబై ఇండియన్స్ నినాదాన్ని ప్రస్తావిస్తూ ముగించాడు. అతడి ప్రసంగం ముగిసిన వెంటనే నీతా అంబానీ చప్పట్లు కొట్టారు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడగా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయర్లు అందరూ విఫలం అయ్యారు. A post shared by Movie Talkies (@movietalkies) Also Read: CM Vijay: కోలీవుడ్‌కు ముఖ్యమంత్రి విజయ్ బంపర్ ఆఫర్.. తమిళనాడులో సరికొత్త సినీ రూల్స్ Also Read: Indrakeeladri Ghat Road: దుర్గమ్మ భక్తులకు బిగ్ అలర్ట్.. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత.. ఎందుకంటే? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.