
సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు సోమవారం భారీగా కోలుకున్న రూపాయి మంగళవారం కాస్త బలహీనపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.39గా ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో 76,224 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 76,588 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 37 పాయింట్ల లాభంతో 24,068 వద్ద కదలాడుతోంది. చాలా రోజుల తర్వాత నిఫ్టీ మళ్లీ 24 వేల మార్క్‌ను దాటింది (stock market news today). సెన్సెక్స్, నిఫ్టీలో వేదాంత, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా, బంధన్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, హిటాచీ ఎనర్జీ, రైల్ వికాస్, బ్లూ స్టార్, ఆల్కెమ్ ల్యాబ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 110 పాయింట్ల లాభంతో ఉంది. ఐపీఎల్ Home » Business » Indian Stock Market On 26th May Sensex, Nifty starts with huge losses sgr ABN , Publish Date - May 26 , 2026 | 09:47 AM ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?