
ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ. ఆయన కోసమైనా ‘పెద్ది’ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. ఇందులో దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటించారు. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా దివ్యేందు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సినిమా అంగీకరించడానికి కారణం వెల్లడించారు. ‘‘నేను ఉత్తరాఖండ్లో షూటింగ్లో ఉన్నప్పుడు ఈ చిత్ర బృందం నుంచి ఫోన్ వచ్చింది. వీలున్నప్పుడు వస్తాను అని చెప్పా. తర్వాత ‘మిమ్మల్ని కలవాలి’ అని బుచ్చిబాబు (Buchi Babu) చాలా మెసేజ్లు పెట్టారు. దీంతో నేను ఆ షూట్ మధ్యలోనే ఆపేసి ఎంతోసేపు ప్రయాణించి చాలా కష్టపడి అక్కడినుంచి ఇక్కడికి వచ్చాను. బుచ్చిబాబును చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో ప్రేమతో వ్యవహరించారు. కళకు ఎంత గౌరవం ఇస్తారో చూశాను. నా పాత్రను వివరించేటప్పుడే నిర్ణయించుకున్నా. ఈ సినిమా (Peddi) ఎలా ఉన్నా బుచ్చిబాబు కోసం చేయాలి అని. వెంటనే ఓకే చేశా. ఆయన నన్ను అంత ప్రభావితం చేశారు’’ అని దివ్యేందు (Divyenndu) తెలిపారు. ఇక పెద్ది కథ గురించి మాట్లాడుతూ..‘‘స్టోరీ చూసి షాక్ అయ్యాను. ఎంత గొప్పగా రాశారో అనుకున్నా. ఎన్నో ట్విస్ట్లు, గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. గుర్తింపు కోసం ఎంత యుద్ధమైనా చేయొచ్చని ఈ సినిమా చూశాక అర్థం అవుతుంది. ‘పెద్ది’ తన గుర్తింపు కోసం ఎంతో పోరాడతాడు. ఆ అంశం నాకు చాలా నచ్చింది’’ అని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.