
ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా మంత్రి నారా లోకేశ్.. ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అమరావతి, మే 26: ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(మంగళవారం) ఉదయం మంత్రి నారా లోకేశ్.. సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు 19,880 మంది హాజరవగా.. మొత్తం 19,741 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎడ్‌సెట్‌లో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి దిశగా విద్యార్థులు మరో ముందడుగు వేశారని మంత్రి అన్నారు. అధికారిక వెబ్సైట్లో ర్యాంక్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను పొందవచ్చు. రాజమండ్రి: గోదావరి జలాల కాలుష్యంపై పవన్ కల్యాణ్ దృష్టి ‘నన్ను ప్రశ్నించండి’.. కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శ్రీకారం Home » Andhra Pradesh » Krishna » AP EdCET 2026 results released suchi ABN , Publish Date - May 26 , 2026 | 11:41 AM