
ఇంటర్నెట్ డెస్క్: వైట్ హౌస్‌లో మారుతున్న పరిస్థితుల కారణంగా కీలక విదేశాంగ విధాన నిర్ణయాలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) దూరంగా ఉంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలను కూడా వాన్స్ వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను భవిష్యత్తు అధ్యక్ష అభ్యర్థిని కాదని, ప్రస్తుత ఉపాధ్యక్షుడినని వ్యాఖ్యానించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే 2028 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం కొంతకాలంగా వాన్స్‌కు మార్కో రూబియోతో తెర వెనుక రహస్య పోటీ జరుగుతోందని మీడియా వర్గాలు వెల్లడించాయి. వాన్స్ తన నిర్ణయాలను మార్చుకోవడానికి అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఇటీవల క్యాబినెట్ నుంచి వైదొలగడం కూడా ప్రధాన కారణమని మీడియా కథనాలు వెల్లడించాయి. అమె పదవి నుంచి దిగిపోవడం వల్ల విదేశీ వ్యవహారాల విషయంలో వ్యూహాలను పంచుకోవడానికి అనుభవజ్ఞులైన అధికారులు లేకుండాపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌తో యుద్ధం విషయంలోనూ వాన్స్ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు.. యుద్ధాన్ని ముగించాలని సూచిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌పై యుద్ధం గురించి ఇటీవల వాన్స్ మాట్లాడుతూ.. అందరికీ అణ్వాయుధాలు కావాలనుకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ క్రమంలోనే విదేశాంగ నిర్ణయాలపై వాన్స్ అనుసరిస్తున్న విశ్లేషణాత్మక విధానాలపై ట్రంప్ అసహనంగా ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ట్రంప్ ఆ దేశంపై దాడుల ప్రణాళికలను పంచుకుంటున్నట్లు పేర్కొన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.