
గద్వాల అర్బన్,మే 24 : ఉపాధి హామీ పథకంలో పనికి రాకుండా ఉన్న వ్యక్తుల మీద బిల్లులు లిప్ట్ చేసి లక్షల రూపాయలు కాజేసిన ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పరిధిలోని ఇర్కిచేడు గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం పంచాయతీ నిధులలో అవకతవలపై అరోపణలు రావడంతో అధికారులు నిధుల విషయంలో ఆరా తీస్తున్న క్రమంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. గతంలో చేసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పంచాయతీ ఖజనాకు గండికొట్టినట్లు సమాచారం. అలాగే ఉపాధి హామీ పథకంలో కూడా లక్షల రూపాయలు కాజేసిన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. ఈ క్రమంలో ఉపాధి పనికి వెళ్లని వారిపై కూడా బిల్లులు లిప్ట్ చేసి కాజేయడంతో అసలు వ్యవహరం బయటకిపొక్కిన్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఆర్టికల్చర్కు సంబంధించి ఆయా పనులలో కూడా అవకతవకలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపై గ్రామంలోని కొందరు వ్యక్తులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ నిధులతో పాటు ఉపాధి హామీ పథకం, ఆర్టికల్చర్ తదితర వ్యవహారాలపై విచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై ఎంపీడీవో రమణరావు వివరణ కొరగా..ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. # 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999 Website: +91-40-23291163 digitalsales@tppl.news The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd