
యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోలులో జాప్యం, లిఫ్టింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సింగారం గ్రామ రైతులు గోదాంకు తాళం వేసి నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు, మిల్లర్లు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి గోదాంల నుంచి లిఫ్టింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించినట్లు సమాచారం. # 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999 Website: +91-40-23291163 digitalsales@tppl.news The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd