
వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్ అంటే లాటరీ? లీవ్? ఏదైనా రాజకీయ సెటైర్‌నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్ “విజిల్” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. “ఆపరేషన్ L” అలా మొదలైందా? అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two May 26 2026 11:59 AM | Updated on May 26 2026 12:04 PM “ఆపరేషన్ L” అలా మొదలైందా? అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two Leaves గుర్తు) ఒక్కో “ఆకు” ఇప్పుడు ఊడిపోతోందన్న వ్యాఖ్య. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే లెక్క కూటమి నుంచి మెజారిటీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకేకి సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం స్థిరంగానే ఉన్నా… ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. “కూటమి ప్రభుత్వం” క్రమంగా “ఒకే పార్టీ ప్రభుత్వం”గా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. తాజాగా మూడు స్థానాలు, ఫస్ల్ 1.. మొత్తంగా నాలుగన్నమాట. పోను పోను ఆ సంఖ్యా పెరగవచ్చనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. ఎందుకంటే.. మిత్రపక్షాలు ఊరుకుంటాయా? అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై చిరుత్తైగల్ కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నాడీఎంకే రెబెల్స్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి… “కేబినెట్లో చోటు కాదు, కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం” అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్… టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు “మద్దతు ఇస్తూనే దూరం పాటించే” రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే… అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా… మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది. చట్టపరమైన చిక్కుల్లేకుండా.. అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా… ముందుగా రాజీనామా.. తర్వాత ఉపఎన్నికలో మళ్లీ పోటీ అనే మోడల్‌ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ