
Hero Nandu: హీరో నందు తాజాగా దర్శకుడు సుకుమార్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక మాట తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని నందు చెప్పాడు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఈ విషయాలను చాలా ఓపెన్‌గా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ నందును ఇప్పుడు మీరు చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నారు అని అడిగాడు. దానికి నందు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. గతంలో తాను చాలా సిగ్గుగా ఉండేవాడినని చెప్పాడు. ఒకసారి దర్శకులతో సినిమా చేసిన తర్వాత మళ్లీ వాళ్లను కలవడానికి కూడా ఇబ్బంది పడేవాడినని తెలిపాడు. సుకుమార్, బోయపాటి శ్రీను, దేవా కట్టా లాంటి పెద్ద దర్శకులతో పని చేసినా కూడా వారిని సంవత్సరాల పాటు కలవలేదని చెప్పాడు. ముఖ్యంగా 100% Love సినిమా తర్వాత సుకుమార్‌ను దాదాపు ఏడు సంవత్సరాలు కలవలేదని తెలిపాడు. తర్వాత రంగస్థలం ఈవెంట్ సమయంలో సుకుమార్‌ను మళ్లీ కలిసినట్టు నందు చెప్పాడు. ఆ సమయంలో సుకుమార్ మరుసటి రోజు ఆఫీస్‌కు రావాలని చెప్పారట. అక్కడ జరిగిన మాటలు తన జీవితాన్ని మార్చేశాయని నందు తెలిపాడు. “నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా నిన్ను ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవడానికి,” అని సుకుమార్ అడిగారని చెప్పాడు. అలాగే “నాకు వందల పనులు ఉంటాయి. చాలా మందిని కలవాలి. నువ్వు తరచూ కనిపిస్తేనే గుర్తుంటావు. అప్పుడే నీకు పాత్ర ఇవ్వాలని ఆలోచిస్తాను” అని చెప్పారట. ఆ మాటలు తనకు పెద్ద లైఫ్ లెసన్ అయ్యాయని నందు చెప్పాడు. పని అడగడంలో తప్పు లేదని అర్థమైందని తెలిపాడు. ఎవరినీ మోసం చేయకుండా మన టాలెంట్‌ను మనమే చూపించుకోవాలని తెలుసుకున్నానని అన్నాడు. ఆ రోజు తర్వాత తనలోని ఆ రోజు తర్వాత తనలోని భయాన్ని తగ్గించుకున్నానని చెప్పాడు. ఇప్పుడు అవకాశాల కోసం ధైర్యంగా మాట్లాడుతున్నానని తెలిపాడు. ఈ విషయం సినిమా రంగానికే కాదు ప్రతి ఉద్యోగానికి ఉపయోగపడుతుందని నందు చెప్పాడు. భయం వదిలి కష్టపడి ముందుకు వెళ్తేనే విజయం వస్తుందని నందు తెలిపాడు.