
Tirumala News: నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా తిరుమల శ్రీవారి దర్శనానికి యేడాదిలో 365 రోజులు భక్తులు దర్శనానికి వస్తూనే ఉంటారు. వారి సౌకర్యాల కల్పన కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల కోసం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. TTD Good News for Devotees: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే దాదాపు రెండు, మూడు నెలల ముందే ముందస్తుగా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా చాలా మంది నేరుగా స్వామి దర్శనానికి ఎంతో మంది తిరుమలకు వస్తుంటారు. వారందరు సర్వ దర్శనం లైన్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో దాదాపు 24 గంటలకు పైగా లైన్లో నిలబడితే కానీ స్వామి వారి దర్శనం చేసుకోలేని పరిస్థితి ఉంది. అంతేకాదు తిరుమలలో సర్వ దర్శనానికి వచ్చే భక్తులను క్యూ కాంప్లెక్స్‌లో పెడతారు. దీని వల్ల తిరుమల కొండపై కానీ.. కింద కానీ ఇతర దివ్య క్షేత్రాలను చూడాలనుకువారికి సమయం సరిపోవడం లేదు. అలాంటి సర్వ దర్శనం భక్తుల కోసమే మళ్లీ రీ ఎంట్రీ సదుపాయం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల కొండపై ఎస్పీ మ్యూజియం నుంచి రీ ఎంట్రీ సదుపాయం కల్పిస్తోంది. ముఖ్యంగా సమ్మర్ హాలీడేస్ కారణంగా చాలా మంది భక్తులు తిరుమల కొండకు పోటెత్తుతున్నారు. ప్రతి రోజు ఎంత లేదన్న 80 వేల మంది శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక సర్వ దర్శనం క్యూ లైన్లలో వయసు మీరిన పెద్దవాళ్లు, పపి పిల్లలతో వచ్చిన వాళ్లు తిరుమల దర్శనానికి వేచి ఉండే కంపార్ట్మెంట్స్ లో వేచి ఉండలేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక సర్వ దర్శనం క్యూ లైన్లలో వయసు మీరిన పెద్దవాళ్లు, పపి పిల్లలతో వచ్చిన వాళ్లు తిరుమల దర్శనానికి వేచి ఉండే కంపార్ట్మెంట్స్ లో వేచి ఉండలేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అలాంటి వారికి రీ ఎంట్రీ సదుపాయం కల్పిస్తోంది టీటీడీ. ముఖ్యంగా సర్వ దర్శనం టోకెన్ కలిగిన భక్తులు .. క్యూలైన్ నుంచి బయటకు వచ్చి తిరిగి దర్శనం సమయానికి క్యూ లైన్లోకి ఎంట్రీ ఇచ్చిందుకు ఈ రీ ఎంట్రీ సదుపాయం కల్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గతంలో ఈ సదుపాయం ఉండేది. మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని తీసేసింది. తాజాగా మరోసారి సర్వదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు బయటకు వెళ్లి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు ముందుగా సర్వ దర్శనం క్యూలైన్లోకి వెళ్లాకా వైకుంఠం 2 దగ్గర తమ ఆధార్ ను చూపెట్టి దర్శనం టోకెన్ పొందవచ్చు. బయటకు వెళ్లాలనుకునే వారు 17వ నెంబర్ కంపార్టెంట్ దగ్గర రీ ఎంట్రీ పాస్ ఇస్తారు. అక్కడే ఉన్న ఎగ్జిట్ పాయింట్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. వెళ్లేటపుడు ఔట్ పాస్ ను స్కాన్ చేయించుకోవాలి. బయటకు వచ్చిన భక్తులు తిరుమలలో తమ గదుల్లో విశ్రాంతి తీసుకోవడం లేదా ఇరత సందర్శనీయ స్థలాలను చూడవచ్చు. ఆ తర్వాత టోకెన్‌లో చెప్పిన టైమ్ కు అటు ఇటుగా 10 నిమిషాల్లో మళ్లీ రీ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలకి వెళ్లి స్వామి దర్శనం చేసుకోని బయటకు రావచ్చు. కంపార్టెమెంట్ గేట్స్ ఓపెన్ అయిన 2 గంటల నుంచి 4 గంటల లోపు శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. రీ ఎంట్రీ పాస్‌తో బయటకు వెళ్లినవారు టోకెన్ పాస్‌లను జాగ్రత్తగా దాచుకోవాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో టోకెన్ పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దర్శనానికి లోపలకి అనుమతించరు. అయితే దర్శనానికి వచ్చే వారు తమ దగ్గరున్న మొబైల్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అక్కడ దగ్గరలోని కౌంటర్ లో కానీ.. తమ కేటాయించిన గదుల్లో వదలివస్తే బెటర్. రీ ఎంట్రీ గేటు దగ్గర ఎలక్ట్రానికి వస్తువులు ఎలాంటి సదుపాయాలు లేవు. కావున భక్తులు ఇది గమనించగలరని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.