
Home » Andhra Pradesh » Ananthapuram » Unfinished school building ABN , Publish Date - May 23 , 2026 | 11:45 PM మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు. మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింది రూ.1.5 కోట్లు నిధులతో ఊరి చివర నూతన పాఠశాల భవనం నిర్మాణం చేప ట్టారు. విడపనకల్లు, మే 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింది రూ.1.5 కోట్లు నిధులతో ఊరి చివర నూతన పాఠశాల భవనం నిర్మాణం చేప ట్టారు. నిధులు సరిపోక పోవటంతో అర్ధాంతరంగా పనులు నిలిపి వేశా రు. దీన్ని కూడా నాసిరకంగా నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఊరికి చివర చెరువులో నిర్మాణం చేపట్టారు. పాఠశాల కార్యాలయ గది, విద్యా ర్థులకు మరుగు దొడ్లు నిర్మాంచారు. అవి ప్రారంభకాకనే దెబ్బ తింటు న్నాయి. దీంతో రూ. కోటిన్నర నిధులు వృథా అవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన 250 నూతన బెంచీలు మాయం అయ్యాయి. కేవలం 10 బెంచీలను మాత్రమే ఓ గదిలో మూలన పడే శారు. ఈ నూతన గదులు నిర్మాణం పూర్తి అయి ఉంటే కరకముక్కల విద్యార్థులు పాత పాఠశాల గదుల్లో భయాందోళన మధ్య చదువులను కొసాగించే అవసరం ఉండేది కాదు. ఇప్పటికే పాత పాఠశాల గదుల పై కప్పు పెచ్చులు నాలుగు సార్లు ఊడి పడ్డాయి. ఒక సారి ఇద్దరు విద్యా ర్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అటు నూతన భవనం పూర్తికాక, ఉ న్న భవనం సరిగా లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడు తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికైనా కరకముక్కల విద్యార్థులకు నూతన పాఠశాల భవని ఏర్పాటు చేస్తారా అని విద్యార్థుల తల్లి దం డ్రుల ప్రశ్నిస్థున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు మాత్రం పాత పాఠశాల భవనం మరమ్మతులకు ప్రతి పాదనలు పంపామని చెబుతున్నారు. నిధులు వచ్చిన వెంటనే గదుల మరమ్మతులు చేపడుతామని తెలుపుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ శ్రీనివాసులను వివరణ కోరగా నూతన భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ‘మన బడి - మన భవిష్యత్తు’ కార్యక్రమం కింద పనులు చేపట్టడం కోసం ఎస్ఎస్ఓకు ప్రతి పాదన లు పంపామని చెప్పారు. ఆగిపోయిన నూతన భవనాన్ని పూర్తిచేసి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తరగతి గదుల కొరత లేకుండా చూస్తామని ఆయన తెలిపారు.
Summary status: pending