
ఇంటర్నెట్‌డెస్క్: కృత్రిమ మేధను అన్ని రంగాలు వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. బేసిక్ టాస్క్‌లకే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో ఏఐ (AI)ని వినియోగించేందుకు కంపెనీలు భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని వాడే విషయంలో తొలుత సంకోచించిన బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు.. ఇప్పుడు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. లేకపోతే తాము పోటీలో నిలవలేమోనని ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఏఐ సాధనాలు వాడేలా తమ సిబ్బందిని సిద్ధం చేసే ఫైనాన్స్ ట్రైనింగ్ కంపెనీల వైపు చూస్తున్నాయి. అలా ట్రైనింగ్ ఇస్తోన్న ఓ సంస్థ ఇప్పుడు అమెరికా (USA)లో ప్రాచుర్యం పొందింది. దాని పేరే వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్. 2025లో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్.. వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్ స్థాపించారు. వారిద్దరూ గతంలో సాఫ్ట్‌బ్యాంక్‌లో పనిచేశారు. ఏఐ ప్లానింగ్‌లో అమెరికా బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ.. భారీగా సంపాదిస్తున్నారు. ఒక్క క్లాస్ తీసుకుంటే.. 25వేల డాలర్లు (రూ.23,85,322) వసూలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రముఖ ఆర్థిక సంస్థలైన సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆ జాబితాలో ఉన్నాయి. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్, గూగుల్ జెమినై టూల్స్‌తో తమ రోజూవారీ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా పూర్తిచేయడంలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉద్యోగులపై పిడుగులా చూస్తున్నా.. భవిష్యత్‌లో ఇదే అవసరంగా మారడాన్ని మనం గుర్తిస్తామని ఈ ఏఐ గురువులు చెప్తున్నారు. కాగా.. చాలామంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడంలో తగిన శిక్షణ లేదు. దాంతో పాత మోడళ్లనే ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించడానికి భారీ సంఖ్యలో ఏఐ నిపుణుల అవసరం ఉందని టెక్ రంగ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. ఈ ఏఐతో లేఆఫ్‌లు ఐటీ రంగానికే పరిమితం కాగా.. చాలామంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడంలో తగిన శిక్షణ లేదు. దాంతో పాత మోడళ్లనే ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించడానికి భారీ సంఖ్యలో ఏఐ నిపుణుల అవసరం ఉందని టెక్ రంగ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. ఈ ఏఐతో లేఆఫ్‌లు ఐటీ రంగానికే పరిమితం కాలేదు. స్టాండర్డ్ చార్టర్డ్, సిటీగ్రూప్, వెల్స్ ఫార్గో అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ సంస్థలు సంప్రదాయ ఉద్యోగాలను తొలగించే ప్లాన్స్‌ను ఇప్పటికే ప్రకటించాయి. రికార్డు స్థాయి ఆదాయాలను ఆర్జిస్తున్నా కూడా.. అవన్నీ కలిసి ఇప్పటివరకు 5000 వేల ఉద్యోగాలకు కోత పెట్టాయి. ఇక, ఏఐ విస్తృత వినియోగంలో ఆసియా ఖండం ముందువరుసలో ఉంది. ఐఎంఎఫ్ విడుదల చేసే ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ప్రకారం.. 174 దేశాల్లో సింగపూర్ తొలిస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్లు కూడా ఆసియా వైపు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.