
లఖ్‌నవూ: వరుసగా ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లఖ్‌నవూ: వరుసగా ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (101*; 51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఐపీఎల్లో అతడికిదే తొలి సెంచరీ. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69; 39 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. ప్రియాంశ్ ఆర్య (0) షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే వెనుదిరిగాడు. కూపర్ కానెల్లీ (18) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. సూర్యాంశ్ షిడ్జే (9*) నాటౌట్‌గా నిలిచాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలర్లలో షమీ 2, అర్జున్ తెందుల్కర్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా మిగిలాయి. ఈ విజయంతో ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. రేపు ముంబయితో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితమే పంజాబ్ భవితవ్యాన్ని తేల్చనుంది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితేనే పంజాబ్ కింగ్స్‌కు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రాజస్థాన్ నెగ్గితే నెట్‌రన్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరుతుంది. అప్పుడు పంజాబ్ ఇంటి ముఖం పట్టాల్సి వస్తుంది. ఈ మ్యాచ్‌లో తొలుత లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ (72; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుష్ బదోని (43; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అబ్దుల్ సమద్ (37*), రిషభ్ పంత్ (26) ఫర్వాలేదనిపించారు. కులకర్ణి (0), నికోలస్ పూరన్ (2), ముకుల్ చౌదరి (1) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. అర్జున్ తెందూల్కర్ (5*) నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో మార్కో యాన్సన్, యుజ్వేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్ చెరో వికెట్ తీశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending