
సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై రూపొందించే చిత్రంలో హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై రూపొందించే చిత్రంలో హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతోన్న ‘సేయోన్’(Seyon) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ మదురైలో శరవేగంగా జరుగుంటోంది. ఇదిలావుంటే, హీరో శివ కార్తికేయన్ సత్యజ్యోతి ఫిలిమ్స్ చిత్రానికి డేట్స్ కేటాయించారు. ‘పార్కింగ్’ ఫేం రామ్‌కుమార్ (Ramkumar) దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇందులో శివకార్తికేయన్ తన గెట్ప మార్చుకుని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. అంతేకాకుండా, సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సిబి చక్రవర్తి మరోమారు శివకార్తికేయన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘డాన్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియో నిర్మించనుంది. Home » South Cinema » Sivakarthikeyan Different looks for upcoming movies avm ABN , Publish Date - May 26 , 2026 | 02:38 PM