
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad Real Estate: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో భూముల మార్కెట్ విలువ పెంపును అమలు చేయనుంది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ పెంపుదల కార్యక్రమం చేపట్టిందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ పెంపుదల వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రకంగా బూస్ట్ అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పెంపుదల కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 100శాతం వరకు ఉండేలా సీలింగ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భూములు ధరలు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతున్నాయి..: హైదరాబాద్ పరిధిని 350 ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల మార్కెట్ ట్రెండ్ మరియు డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రేట్లను ఖరారు చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఎకరా కనిష్ట విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు పెరగనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల సగానికి హైదరాబాద్ పరిధిని 350 ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల మార్కెట్ ట్రెండ్ మరియు డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రేట్లను ఖరారు చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఎకరా కనిష్ట విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు పెరగనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల సగానికి పైగా ప్రాంతాల్లో ప్లాట్ల విలువను రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అపార్ట్మెంట్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం 3500 నుంచి 4 వేల వరకు ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ విలువను 6000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీమియం స్థలాలుగా పిలవబడే కోకాపేట్, రాయదుర్గం, నార్సింగి వంటి ప్రాంతాల్లో ఎకరా ధర ప్రభుత్వ విలువ ప్రస్తుతం రూ. 2 కోట్లు ఉండగా, దాన్ని 4 కోట్ల వరకు పెంచాలని ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో చదరపు గజం విలువ రూ. 80,000 - రూ. 90,000కు చేరుకోనుంది. ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా అదనంగా రూ. 1,000 నుండి రూ. 1500 కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. Also Read: ప్రగతినగర్,నిజాంపేట్‌లో అమ్ముడుపోని ప్లాట్లు నిజానికి బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో ప్రభుత్వ ధర్మం మాత్రం అలాగే ఉన్నాయి దీని వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా తగ్గింది. అందుకే బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ ధరలకు మధ్య ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమి బేస్ రేట్లు పెరిగినట్లు అయితే ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుంది. ప్రభుత్వం పెంచిన విలువను గైడ్ లైన్ వాల్యూ అని పిలుస్తారు లేదా సర్కిల్ రేట్ అని కూడా పిలుస్తారు. అంటే ఒక ప్రాంతంలో భూములను ఆస్తులను నిర్ణయించే మినిమం ధరగా చెప్పవచ్చు. Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!! Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము. స్థానికం నుంచి అంతర్జాతీయం