
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో గతేడాది జరిగిన మెగా డీఎస్సీపై కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేల్చి చెప్పింది. ఇది వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వసాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారమని పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ‘‘మెగా డీఎస్సీ పరీక్షల్ని అత్యంత పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో, అత్యున్నత స్థాయి డిజిటల్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించాం. మల్టీ-సెషన్ పద్ధతిలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన ఈ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యం. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదు. ఇక పి. నవీన్ అనర్హత అంశానికి సంబంధించి, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరు కావడంతో రూల్ 20(vi) ప్రకారం అతడి అభ్యర్థిత్వం రద్దు చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ, రాష్ట్ర స్థాయి అప్పీల్ కమిటీలు నిబంధనల ప్రకారం విచారణ జరిపి కేసును పరిష్కరించామని ప్రభుత్వం వివరించింది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైన కేవలం 148 రోజుల్లోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత గతేడాది ఆగస్టు 22న అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు, ర్యాంకులతో కూడిన అధికారిక మెరిట్ జాబితాలను పారదర్శకంగా వెబ్సైట్లో విడుదల చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఎటువంటి డేటా డిలీట్ కాలేదని, డిజిటల్ రికార్డులన్నీ మల్టీ-లెవెల్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారా భద్రంగా ఉన్నాయని మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైన కేవలం 148 రోజుల్లోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత గతేడాది ఆగస్టు 22న అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు, ర్యాంకులతో కూడిన అధికారిక మెరిట్ జాబితాలను పారదర్శకంగా వెబ్సైట్లో విడుదల చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఎటువంటి డేటా డిలీట్ కాలేదని, డిజిటల్ రికార్డులన్నీ మల్టీ-లెవెల్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారా భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లు, ఎంపికలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని, ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు, ఇతర కోటాలకు 'హారిజాంటల్ రిజర్వేషన్' అమలు చేయడం వల్ల వారు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఎంపికయ్యారని వివరణ ఇచ్చింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో స్వయంగా ఇచ్చిన 'పోస్ట్ ప్రిఫరెన్స్' ఆధారంగానే ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పోస్టుల కేటాయింపు జరిగిందని, ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్వీనర్ నియామకం కూడా ప్రభుత్వ ఉత్తర్వులకు, సేవా నిబంధనలకు అనుగుణంగానే అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంత పకడ్బందీగా జరిగిన మెగా డీఎస్సీ-2025 పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సబబు కాదు’’ అని ‘ఎక్స్’లో పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్.ఎస్.షాపింగ్ మాల్ వద్ద రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి.