
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు చేరుకున్నారంటూ ప్రచారం జరిగింది. దాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.