
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ ధర్మశాలలో జరగనుంది. ఈ కీలక పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాటర్ ఓ భారీ రికార్డును అందుకునే అవకాశముంది. కోహ్లీ మరో 43 పరుగులు చేస్తే ఐపీఎల్లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్ చేశాడు. ఈ సీజన్లో కోహ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో 50.63 సగటు, 163.82 స్ట్రైక్‌రేట్‌తో 557 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో వరుసగా మూడు సీజన్లలో ముగ్గురు మాత్రమే 600 కంటే ఎక్కువ రన్స్ చేశారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) ఉన్నారు. 2018లో ‘బాల్ ట్యాంపరింగ్‘ ఉదంతం నేపథ్యంలో వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సిక్సర్లు బాదడంలో వైభవ్ సూర్యవంశీ దిట్ట. అలాంటి సూపర్ హిట్టింగ్ బ్యాటర్‌ను డిఫెన్స్ ఆడమంటే ఎలా ఉంటుంది?