
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన కెరీర్లో తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 ఎలిమినేటర్‌లో భాగంగా బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో సత్తాచాటాలని 15 ఏళ్ల వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో వైభవ్ రెండో స్ధానంలో న్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 232.27 స్ట్రైక్ రేట్‌తో 583 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా యువ ఆటగాడు జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ పేరిట ఉంది. ఐపీఎల్-2024 సీజన్లో మెక్‌గర్క్ 234.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇప్పుడు సన్‌రైజర్స్‌పై వైభవ్ డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తే స్ట్రైక్ రేట్ పరంగా మెక్‌గర్క్‌ను అధిగమించే అవకాశముంది. 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లను పరిగణనలోకి తీసుకుంటే, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్ (232.27) నమోదు చేసిన రికార్డు వైభవ్ పేరిటే ఉంది. గేల్ రికార్డుపై కన్ను కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డుపై కూడా వైభవ్ కన్నేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) పేరిట ఉంది. వైభవ్ మరో 7 సిక్సర్లు కొడితే క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల సుదీర్ఘ రికార్డు బద్దలవుతుంది. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు క్రిస్ గేల్: 59 సిక్సర్లు (14 ఇన్నింగ్స్ -ఐపీఎల్ May 26 2026 6:58 PM | Updated on May 26 2026 7:21 PM ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు క్రిస్ గేల్: 59 సిక్సర్లు (14 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2012) వైభవ్ సూర్యవంశీ: 53 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ - ఐపీఎల్ 2026)* ఆండ్రీ రస్సెల్: 52 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2019) క్రిస్ గేల్: 51 సిక్సర్లు (16 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2013) చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు ‘సిస్టమ్’ మేకింగ్ ఫోటోలను షేర్ చేసిన జ్యోతిక (ఫొటోలు) పలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవి (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు (ఫొటోలు) మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ 15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్