
ఇంటర్నెట్ డెస్క్: కృతిమ మేధ కారణంగా పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు ఉండబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయంగా ఎప్పటికీ మారలేదన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎంట్రీ లెవల్లో భారీగా ఉద్యోగ కోతలు ఉంటాయని అనుకున్నా. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం కొన్ని కంపెనీల అభివృద్ధికి, ఉద్యోగుల పనితీరు మెరుగుదలకు ఏఐ కీలకంగా మారింది. సాంకేతికతను అందిపుచ్చుకున్న వారు స్థిరంగా కొనసాగుతున్నారు. మనుషులు చేసిన పనులను ఏఐ చేస్తుందేమో కానీ వారి ఆలోచనలను, సృజనాత్మకతను ఎప్పటికీ భర్తీ చేయలేదు. మనుషులకు ప్రత్యామ్నాయంగా మారలేదు’’ అని శామ్ అల్టామన్ అన్నారు. తాను కొన్ని రోజులు ఈ మెయిల్స్ సమాధానాలకు ఏఐని వినియోగించినట్టు తెలిపారు. కానీ మనుషుల భావాలు ముఖ్యమని గ్రహించి స్వయంగా తానే ఈ మెయిల్స్‌కు రిప్లై ఇచ్చినట్లు తన స్వీయ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చాలా మంది తక్కువ బడ్జెట్లో మంచి గేమింగ్ ఫోన్స్ కొనుగోలు చేయాలని కోరుకుంటారు.