
Tamil nadu politics: తమిళనాడు రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు టీవీకేలో చేరారు. ఇక తాజాగా.. అంబ సముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు అందజేశారు. ఈ క్రమంలో టీవీకే లో చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం.