
SRH vs RR IPL 2026 Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో తలపడనుంది. ఈ సీజన్లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లో కీలక ప్లేయర్లపై ఓ లుక్కేయండి.. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు హెన్రిచ్ క్లాసెన్ కీలకంగా మారాడు. టీమ్‌లో ఎవరు ఆడినా.. ఆడికపోయినా.. క్లాసెన్ మాత్రం తన విధ్వంసంతో జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. 14 ఇన్నింగ్స్‌లలో 159.47 స్ట్రైక్ రేట్‌తో 606 పరుగులు సాధించి.. ఒక టోర్నమెంట్లో 4వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 600 పరుగులకు పైగా సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో క్లాసెన్ నిలబడితే.. విజయం నల్లేరుపై నడకే. క్లాసెన్కుతోడు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండడం హైదరాబాద్‌కు ప్లస్ పాయింట్. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఐపీఎల్ 2026లో 500 పరుగుల మార్కును దాటారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ దళంపై ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ఖాయం. కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంట్రీతో జట్టుతో స్థిరత్వం వచ్చింది. అతని రాక బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. నాకౌట్ మ్యాచ్‌లో కమిన్స్ అనుభవం కీలకం కానుంది. ఈ సీజన్లో ఇషాన్ మలింగ బౌలింగ్‌లో దుమ్ములేపుతున్నాడు. ఈ శ్రీలంక పేసర్ 14 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టి.. కీలక సమయాల్లో మ్యాచ్‌లను మలుపుతిప్పాడు. కొత్త బంతితో, డెత్ ఓవర్లలో వికెట్లు తీస్తూ చక్కగా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన యువ పేసర్ షకీబ్ హుస్సేన్.. సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి ఈ సీజన్లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన యువ పేసర్ షకీబ్ హుస్సేన్.. సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి 10 మ్యాచ్‌లలో ప్రతి దానిలోనూ కనీసం ఒక వికెట్ తీసి.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మరో యంగ్ పేసర్ ప్రఫుల్ హింగే కూడా కేవలం ఆరు మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌లో కీలక రన్స్ చేయడమే కాకుండా బంతితోనూ రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఏడు వికెట్లు కూడా తీశాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణిస్తే.. SRH కు తిరుగుండదు. ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. పవర్ ప్లే వరకు క్రీజ్‌లో ఉన్నా విధ్వంసం సృష్టిస్తాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 393 పరుగులు చేసిన హెడ్.. కీలక పోరులో దుమ్ములేపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.