
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే.. ఇరాన్‌పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా (USA) సన్నద్ధమవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి. ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే.. ఇరాన్‌పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా (USA) సన్నద్ధమవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది (Iran closes airspace). దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ ఎయిర్లైన్లకు నోటమ్ జారీ చేసింది. ఈనెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నోటమ్ జారీ చేసే సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్ (Iran) గగనతలాన్ని దాటింది. ఆ విమానం శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం టెహ్రాన్‌కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందినదిగా తెలుస్తోంది. ఇక, అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాల్లో ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశముంది. అదే సమయంలో ఈ దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే.. టెహ్రాన్‌పై మళ్లీ దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరాన్ కూడా తన గగనతలాన్ని మూసివేయడంతో.. పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. నోటమ్ అంటే ఎయిర్‌మెన్ సహా సంబంధిత విభాగాలకు నోటీసులు ఇవ్వడం. సైనిక కార్యకలాపాలు, క్షిపణి పరీక్షలు, పెద్ద ఎయిర్ ఆపరేషన్లు లేదా ప్రమాదకర పరిస్థితుల సమయంలో దీన్ని జారీ చేస్తారు. నిర్దిష్ట గగనతల ప్రాంతాల్లో పౌర విమానాల ప్రయాణాన్ని తాత్కాలికంగా నిషేధించడం దీని ఉద్దేశం. ఇలా చేయడం వల్ల సైనిక కార్యకలాపాలకు సురక్షిత గగనతలం లభిస్తుంది. పౌర విమానాలు ప్రమాద జోన్లోకి వెళ్లకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending