
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Unite8 Sports Channels: వినోదం... వార్తా ప్రసారాలతోపాటు ఓటీటీలతో కుటుంబాలను మొత్తం సంతోషంతో నింపుతున్న జీ మీడియా ఇప్పుడు మరో గొప్ప ముందడుగు వేసింది. భారతీయ మీడియా రంగంలో ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ సంస్థగా అగ్రస్థానంలో ఉన్న 'జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్' ఇప్పుడు స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ప్రేక్షకుల విశేష ఆదరణ, తన ముద్రను చూపించిన జీ మీడియా ఇకపై క్రీడారంగంలో కూడా మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ఛానళ్లను ప్రారంభించింది. జీ మీడియా క్రీడలకు సంబంధించి 'యునైట్8 స్పోర్ట్స్' (Unite8 Sports) పేరుతో సరికొత్త క్రీడా ఛానళ్ల పోర్ట్‌ఫోలియోను ప్రారంభించబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్రీడారంగంలోని సరికొత్త ఫార్మాట్లు, ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో క్రీడాభిమానులకు అత్యుత్తమ వినోదం, అనుభూతిని అందించడమే లక్ష్యంగా జీ మీడియా క్రీడా ఛానళ్లను ప్రారంభించనుంది. దశాబ్దాలుగా జీ సంస్థ వినోద ఛానళ్లలలోనే ముఖ్యమైన క్రీడా ఈవెంట్లను ప్రసారం చేస్తూ స్పోర్ట్స్ రంగంలో విశేష గుర్తింపు సాధించింది. ప్రత్యక్ష ప్రసారాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను ఉపయోగించుకుని భారీ ప్రేక్షకాదరణ (వ్యూయర్షిప్)ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బలమైన పునాదితో క్రీడా రంగంలో మరింత విస్తరించడానికి భారీ ప్రణాళికతో జీ మీడియా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సంస్థ ఒకేసారి నాలుగు ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురానుంది. సరికొత్త ఛానళ్లు ఇవే హిందీలో: యునైట్8 స్పోర్ట్స్ 1 సరికొత్త ఛానళ్లు ఇవే హిందీలో: యునైట్8 స్పోర్ట్స్ 1 (Unite8 Sports 1), యునైట్8 స్పోర్ట్స్ 1 HD (Unite8 Sports 1 HD) ఇంగ్లీష్‌లో: యునైట్8 స్పోర్ట్స్ 2 (Unite8 Sports 2), యునైట్8 స్పోర్ట్స్ 2 HD (Unite8 Sports 2 HD) క్రీడా రంగం అంటే ఒక్క క్రికెట్ కాదు అంతకుమించిన ఆటలు ఉన్నాయి. కొత్త ప్రారంభించనున్న ఈ ఛానళ్లలో ఫుట్‌బాల్, కబడ్డీ, క్రికెట్, బాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, కాంబాట్ స్పోర్ట్స్ (మార్షల్ ఆర్ట్స్) వంటి ప్రముఖ క్రీడలను ప్రసారం చేయనున్నారు. ఈ ఛానళ్ల ప్రారంభానికి అవసరమైన దరఖాస్తులను సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు జీ మీడియా తెలిపింది. జీ సంస్థలోని మానవ వనరుల నైపుణ్యాలను, మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ పనిచేస్తున్న భావేష్ జనావ్లేకర్క్కు క్రీడారంగంలో స్పోర్ట్స్ అందించనుంది. జీ సంస్థకు చెందిన మరాఠీ మూవీస్ క్లస్టర్ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం. యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా వ్యవహరిస్తారు. బిజినెస్‌పై ఉన్న ఆయన అవగాహన, వ్యూహాత్మక చొరవతో జీ స్పోర్ట్స్ విభాగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా భావేష్ జనావ్లేకర్ మాట్లాడుతూ.. "భారత్‌లాంటి సువిశాల దేశంలో ప్రపంచవ్యాప్త ఆదరణతో పాటు స్థానిక మూలాలు ఉన్న క్రీడలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో లైవ్ కంటెంట్ చూడాలనే ఆసక్తి, విభిన్న క్రీడా ఫార్మాట్లపై ఉన్న క్రేజ్‌తో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ వేగంగా దూసుకుపోతోంది. మా కంటెంట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి, వృద్ధి చెందుతున్న అవకాశాలను అందుకోవడానికి ఈ నాలుగు లీనియర్ స్పోర్ట్స్ ఛానళ్ల ప్రారంభం ఎంతగానో దోహదపడుతుంది' అని ధీమా వ్యక్తం చేశారు. జీ ఛానళ్లలో ఫిఫా వరల్డ్ కప్? క్రీడా విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇచ్చేందుకు జీ సంస్థ భారీ ప్రణాళిక వేసింది. యునైట్8 పేరిట ప్రారంభించే ఈవెట్ల సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారతదేశంలో టీవీల్లో, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేసేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA)తో చర్చలు చేస్తోంది. ప్రత్యేకంగా లీనియర్ స్పోర్ట్స్ ఛానళ్లను తీసుకురావడంతో వేగంగా వృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందుకోవడానికి.. సరికొత్త ఆవిష్కరణలతో ప్రేక్షకులను అలరించడానికి 'జీ' గ్రూప్ సిద్ధమైంది.