
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. RCB Into IPL 2026 Finals: ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైన 17 ఏళ్ల తర్వాత తొలి ట్రోఫీని దక్కించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనే కసితో ఆడి గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సీజన్లో అత్యధిక స్కోర్ బాదడమే కాకుండా గుజరాత్‌ను బౌలింగ్‌తో ఘోరంగా దెబ్బతీసి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతూ ఆడుతున్న బెంగళూరు మొదట ప్లేఆఫ్స్‌లో బెర్త్‌ను దక్కించుకోవడమే కాకుండా టాప్‌లో నిలిచింది. రజత్ పాటిదార్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు ట్రోఫీ సాధించేందుకు ఒక్కడుగు దూరంలో నిలిచింది. Also Read: Gold Treasure: భూమిని తవ్వితే బంగారం నాణేలు ప్రత్యక్షం.. విలువ ఎన్ని కోట్లంటే? భారీ తేడాతో విజయం ధర్మశాల వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. 19.3 ఓవర్లకు 162 పరుగులు చేసి గుజరాత్ ఆటను ముగించింది. ప్రత్యర్థి ఏమాత్రం పోటీనివ్వకపోవడంతో బెంగళూరు జట్టు 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ తరఫున రాహుల్ తెవాటియా మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీస పోరాటం చేయలేకపోయారు. తెవాటియాకు తోడు జోస్ బట్లర్ కొంత రాణించినా.. మిగతా బ్యాటర్లందరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. పరువు కాపాడిన రాహుల్ తెవాటియా అద్భుత ఫామ్‌లో ఉన్న సాయి పరువు కాపాడిన రాహుల్ తెవాటియా అద్భుత ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ 14 పరుగులకే ఔటవగా.. కెప్టెన్ శుభమన్ గిల్ రెండే పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటవడంతో గుజరాత్ ఓటమి వైపు అడుగులు వేసింది. బట్లర్ కొద్దిసేపు నిలబడి 11 బంతుల్లో 29 పరుగులు చేశాడు. నిశాంత్ సింధూ (5), వాషింగ్టన్ సుందర్ (8), జేసన్ హోల్డర్ (0), రషీద్ ఖాన్ (8), రబడా (9), మహ్మద్ సిరాజ్ (5), ప్రసిద్ కృష్ణ (6) పరుగులు చేయలేకపోయారు. ఫైనల్‌పై కన్నేసిన బెంగళూరు జట్టు బ్యాటర్లు భారీ స్కోర్ చేయగా.. తామేమీ తక్కువ కాదని బౌలర్లు నిరూపించారు. ఆఖరులో వచ్చిన రాహుల్ తెవాటియా గొప్ప ప్రదర్శన చేశాడు. ఓటమి ఖరారైనా కూడా నిలబడి పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు గొప్పగా పోరాడాడు. నిలకడగా ఆడుతూ.. 43 బంతుల్లో 68 పరుగులు చేయగా.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరంభం నుంచి వికెట్లు తీయడమే పనిగా పెట్టుకున్నారు. బెంగళూరు బౌలింగ్ దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు తట్టుకోలేక నిమిషాల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు మైదానం వీడారు. జాకబ్ డఫీ, రషీఖ్ సలామ్ రెండేసి వికెట్లతో విజృంభించగా.. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలా ఒక్కో వికెట్ తీసి గుజరాత్ బ్యాటింగ్ దళాన్ని కుప్పకూల్చారు. Also Read: Pawan Kalyan: నన్ను రెచ్చగొట్టవద్దు.. మేం ఎదురుదాడి చేస్తాం: పవన్ కల్యాణ్ ధనాధన్ ఇన్నింగ్స్ అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 19 పరుగులకు ఔటవగా. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడినా మోస్తరు పరుగులు చేశారు. కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులు చేసి ఒక సీజన్లో 600 పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పడిక్కల్ 30 పరుగులు చేయగా.. కృనాల్ పాండ్యా అద్భుతంగా ఆడి 43 పరుగులు నమోదు చేశాడు. బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టును ఫైనల్లోకి తీసుకెళ్లాలనే కసితో విధ్వంసం సృష్టించాడు. భారీ స్కోర్ చేస్తే విజయం సాధ్యమని నమ్మిన పడిక్కల్ బ్యాట్‌తో విజృంభించి 33 బంతుల్లో అత్యంత వేగంగా 93 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 9 సిక్సర్లతో రజత్ చెలరేగి ఆడడమే కాకుండా నాటౌట్‌గా నిలిచాడు. టిమ్ డేవిడ్ (4) నిరాశపర్చగా.. పాటిదార్‌తో కలిసి జితేశ్ శర్మ కూడా బ్యాట్‌తో మెరిసి 15 పరుగులు జోడించి గుజరాత్‌కు భారీ లక్ష్యాన్ని విధించాడు. బౌలర్లు ఘోరంగా విఫలం ఫైనల్లోకి అడుగుపెట్టాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఏమాత్రం ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్లు ఆలస్యంగా తీయడంతో అప్పటికే బ్యాటర్లు విజృంభించారు. కగిసో రబాడా, జేసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన సిరాజ్ ఈ మ్యాచ్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్ తీయకపోవడమే కాకుండా పరుగులు కూడా భారీగా సమర్పించుకున్నాడు. ఫలితంగా మూడు ఓవర్లు మాత్రమే వేశాడు. బెంగళూరు ఒకే