
టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ).. సంగ్రూర్ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల్లో ఫుల్ టైమ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: పోస్టుల ప్రకారం పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, (ఇంజినీరింగ్), బీఎస్సీ, బీఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎంసీహెచ్‌తో పాటు ఉద్యోగానుభవం. ఎంపిక: ఇంటర్వ్యూ/ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌తో. దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.06.2026. ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ (ఎన్ఐహెచ్ఆర్), భువనేశ్వర్ .. తాత్కాలిక ప్రాతిపదికన 12 యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: పోస్టుల ప్రకారం యూజీ, పీజీ, ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీవీఎస్సీతో పాటు ఉద్యోగానుభవం. ఇంటర్వ్యూ తేదీలు: మే 28 నుంచి జూన్ 3 వరకు. వేదిక: యానెక్స్ బిల్డింగ్ ఆఫ్ ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్, చంద్రశేఖర్‌పూర్, భువనేశ్వర్, ఒడిశా - 751023. వెబ్సైట్: https://www.icmr.gov.in/employment-opportunities సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ఎంఎఫ్సీఎల్), దిల్లీ.. 12 ఈ1 గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఫైనాన్స్, ప్రాజెక్ట్స్, లీగల్, కంపెనీ సెక్రటరీ, ఐటీ. అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్/ ఎల్ఎల్బీ (సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్). వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూలతో. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2026. వెబ్సైట్: https://sdclindia.com/vacancies.php న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్), మద్రాస్.. 158 అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా, డిగ్రీ. వయసు: 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది. స్టైపెండ్: నెలకు రూ.9,200 నుంచి 12,300 వరకు. ఎంపిక: ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్‌లో మార్కుల మెరిట్‌తో. పోస్టు ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 30.06.2026. చిరునామా: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పక్కం - 603102. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్, ముంబయి.. డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంఈ/ ఎంసీఏ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)తో పాటు ఉద్యోగానుభవం. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100. మిగిలిన వారికి రూ.600. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.06.2026. వెబ్సైట్: https://www.eximbankindia.in/careers గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.