
ఎలిమినేటర్‌లో నేడు హైదరాబాద్ × రాజస్థాన్ ముల్లాన్‌పుర్ ఐపీఎల్లో మరో రసవత్తర సమరానికి వేళైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుంది. లీగ్ దశలో నిలకడగా రాణించిన సన్‌రైజర్స్ భీకరంగా కనిపిస్తుంటే.. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్, ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో ఆడుతుంది. ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడతాయనడంలో సందేహం లేదు. గత సీజన్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ, ఈసారి ప్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బుధవారం రాజస్థాన్‌ను ఇంటిముఖం పట్టించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. లీగ్ దశలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. ఆర్సీబీ, గుజరాత్‌లతో సమానంగా 18 పాయింట్లు సంపాదించినా.. రన్‌రేట్ వల్ల పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు రాజస్థాన్ 8 విజయాలతో నాలుగో స్థానం దక్కించుకుంది. రెండూ బలమైన జట్లే. ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరం. జోరుమీద సన్‌రైజర్స్: సన్‌రైజర్స్ సూపర్ ఫామ్‌లో ఉంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోన్న ఆ జట్టుదే ఈ ఎలిమినేటర్‌లో కాస్త పైచేయిగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. టోర్నీని నెమ్మదిగా ఆరంభించిన ఎస్ఆర్హెచ్.. తర్వాత జోరందుకుంది. తన చివరి పది మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఎనిమిది గెలిచింది. చివరి ఏడు గేములకు కెప్టెన్ కమిన్స్ అందుబాటులోకి రావడం ఆ జట్టుపై సానుకూల ప్రభావం చూపింది. ఈ సీజన్లో రాజస్థాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం హైదరాబాద్‌ను మానసికంగా పైచేయిలో నిలుపుతోంది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. టాప్-4 బ్యాటర్లు అభిషేక్ శర్మ (563 పరుగులు), జోరుమీద సన్‌రైజర్స్: సన్‌రైజర్స్ సూపర్ ఫామ్‌లో ఉంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోన్న ఆ జట్టుదే ఈ ఎలిమినేటర్‌లో కాస్త పైచేయిగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. టోర్నీని నెమ్మదిగా ఆరంభించిన ఎస్ఆర్హెచ్.. తర్వాత జోరందుకుంది. తన చివరి పది మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఎనిమిది గెలిచింది. చివరి ఏడు గేములకు కెప్టెన్ కమిన్స్ అందుబాటులోకి రావడం ఆ జట్టుపై సానుకూల ప్రభావం చూపింది. ఈ సీజన్లో రాజస్థాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం హైదరాబాద్‌ను మానసికంగా పైచేయిలో నిలుపుతోంది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. టాప్-4 బ్యాటర్లు అభిషేక్ శర్మ (563 పరుగులు), హెడ్ (393), ఇషాన్ కిషన్ (569), క్లాసెన్ (606) ఫామ్‌లో ఉన్నారు. వీళ్లను నియంత్రించడం రాజస్థాన్ బౌలర్లకు సవాలే. అయితే హెడ్లో నిలకడ లోపించింది. మరోవైపు ప్రభావవంతమైన బౌలింగ్ సన్‌రైజర్స్ సొంతం. కెప్టెన్ కమిన్స్ 7 మ్యాచ్‌ల్లో 8.67 ఎకానమీ రేట్‌తో 8 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగ (19 వికెట్లు), సాకిబ్ హుస్సేన్ (15) ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్ శివాంగ్ రాణిస్తున్నాడు. అయితే ఈ కీలక సమరంలో రాయల్స్ విధ్వంసక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని వీళ్లు ఎంత మేరకు కట్టడి చేయగలరన్న దానిపె ఫలితం ఆధారపడి ఉంది. ఉత్సాహంగా రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ కూడా ఉత్సాహంగా పోరుకు సిద్ధమైంది. ఆ జట్టు చాలా ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాల్సింది. కానీ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ఘనంగా లీగ్‌ను ఆరంభించిన ఆ జట్టు.. మధ్యలో తడబడి ఆఖరి మ్యాచ్ వరకు తెచ్చుకుంది. సన్‌రైజర్స్ అంత కాకపోయినా రాజస్థాన్ టాప్ ఆర్డర్ కూడా బలంగానే ఉంది. వైభవ్ సూర్యవంశీ (583), యశస్వి జైస్వాల్ (397), ధ్రువ్ జురెల్ (458) తమ జట్టు పరుగుల బాధ్యతను తీసుకున్నారు. జైస్వాల్ మరింత నిలకడగా రాణించడం అసవరం. అయితే ఇప్పుడు అందరి దృష్టి మాత్రం 15 ఏళ్ల వైభవ్ పైనే. సన్‌రైజర్స్‌కు అతి పెద్ద సవాల్ అతడు. వైభవ్ పవర్‌ప్లే పూర్తయ్యే వరకు క్రీజులో ఉంటే అలవోకగా రాయల్స్‌ను పైచేయిలో నిలపగలడు. కాబట్టి అతడిపై హైదరాబాద్ ప్రత్యేక దృష్టి నిలుపుతుందనడంలో సందేహం లేదు. కెప్టెన్ పరాగ్ ఈ పోరులో అయినా ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని జట్టు ఆశిస్తోంది. ఇక బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్‌కు చాలా కీలకం. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో తమను గెలిపించిన అతడిపై ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. టోర్నీ ఆసాంతం ఆర్చర్ (8.76 ఎకానమీతో 21 వికెట్లు) గొప్పగా బౌలింగ్ చేశాడు. మరో ఇద్దరు పేసర్లు బ్రిజేశ్ శర్మ (13 వికెట్లు) బర్గర్ (11 వికెట్లు) కూడా మెరుగైన ప్రదర్శనే చేశారు. యువ లెగ్‌స్పిన్నర్ యశ్‌రాజ్ పుంజా (8 వికెట్లు) విశేషంగా రాణిస్తుండడం రాజస్థాన్‌కు సానుకూలాంశం. ఆల్‌రౌండర్ జడేజా (8 వికెట్లు, 209 పరుగులు) నుంచి బ్యాటుతో, బంతితో రాయల్స్ మరింతగా ఆశిస్తోంది. హైదరాబాద్: అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీశ్, సలీల్ అరోరా, కమిన్స్ (కెప్టెన్), శివాంగ్, మలింగ, సాకిబ్, ప్రఫుల్/హర్షల్. రాజస్థాన్: