
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగిన అత్యంత భీకర దాడులు ఇవేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది (Israel Lebanon conflict). లెబనాన్‌లోని పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్బొల్లా అనుమానిత స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. లెబనాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపించింది (Israeli attack Lebanon). హెజ్బొల్లా మిలిటెంట్లు తమ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు ప్రయోగించారని (Israel Hezbollah war), దానికి ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. తాజా దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించింది. ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి.. మీ పెంపుడు జంతువుల మాటలను అర్థం చేసుకోవచ్చు.. చైనా కంపెనీ సంచలన ఆవిష్కరణ.. Home » International » Israeli Strikes In Lebanon Kill 31 In Deadliest Attack Since Ceasefire sgr ABN , Publish Date - May 27 , 2026 | 06:56 AM