
క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. కెప్టెన్ రజత్ పాటీదార్(93*) విధ్వంసానికి నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్లు.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 38 బౌండరీలు నమోదు చేసింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. 2012లో చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన 33 బౌండరీల రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్! కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి! Home » Sports » rcb create two new ipl playoffs records vs gujarat titans srav ABN , Publish Date - May 27 , 2026 | 06:54 AM