
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆ జట్టును వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేర్చడంలో సఫలమయ్యాడు. నాయకుడంటే ముందుండి నడిపించాలి. ఆ మాటలను ఇవాళ పాటీదార్ అక్షరాలా చేసి చూపించాడు. మొదట తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించడంలో పాటీదార్ కీలకపాత్ర పోషించి షాన్‌దార్‌గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ చేజారినా, బ్యాటింగ్‌లో పొరపాట్లు ఉన్నా సరే, అతడి విలువైన ఇన్నింగ్స్ దానిని మర్చిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా తన టీమ్‌ను రెండోసారి ఫైనల్ చేర్చిన అతను మరో టైటిల్ అందిస్తే చరిత్రలో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. గుజరాత్‌పై విజయంతో ఐపీఎల్లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని (సీఎస్కే, 2010, 2011), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ 2019, 2020), హార్దిక్ పాండ్యా ( గుజరాత్ టైటాన్స్ 2022, 2023), శ్రేయస్ అయ్యర్ (2024లో కేకేఆర్, 2025లో పంజాబ్) ఈ ఘనత సాధించారు. స్లో పాయిజన్ బ్యాటింగ్.. రజత్ పాటీదార్ బ్యాటింగ్ స్టైల్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్లో పాయిజన్ మెళ్లిగా ఎక్కినా బలంగా ప్రభావం చూపుతుంది. అదే తరహాలో ముందు స్లోగా ఆడడం.. ఒకసారి కుదురుకున్నాక అతడి విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం పాటీదార్ స్టైల్. 2025 సీజన్లో బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన (143.77 స్ట్రైక్‌రేట్‌తో 312 పరుగులు) చేసిన అతను ఈసారి మరింతగా చెలరేగిపోయాడు. టైటిల్ సాధించిన నాయకుడిగా వచ్చిన ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్లో అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు, May 27 2026 8:00 AM | Updated on May 27 2026 8:25 AM టైటిల్ సాధించిన నాయకుడిగా వచ్చిన ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్లో అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు, 41 సిక్సర్ల ద్వారానే 362 పరుగులు రాబట్టడం అతని బ్యాటింగ్ ధాటి ఏమిటో చూపించింది. మంగళవారం మ్యాచ్‌లో అతను అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరుగురు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్న అతనూ ఎవరినీ వదలకుండా అందరి బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. కుల్వంత్ ఓవర్లో దూకుడు ప్రదర్శించిన తర్వాత రషీద్ ఓవర్లో అతను 2 భారీ సిక్స్‌లు కొట్టాడు. వీటిలో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రబాడ ఓవర్లోనూ రెండు సిక్స్‌లు కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతను ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్‌లు కొట్టాడు. ఇలా కెప్టెన్‌గా, ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయిన రజత్ పాటీదార్ తొందరలో టీమిండియా గడప కూడా తొక్కే అవకాశం లేకపోలేదు. Captains who led their teams into back to back IPL Finals: - MS Dhoni (2010, 2011). - Rohit Sharma (2019, 2020). - Hardik Pandya (2022, 2023). - Shreyas Iyer (2024, 2025). - Rajat Patidar (2025, 2026). pic.twitter.com/2evHNpBfQK — Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026 Breathtaking Batting 🤯 🎥 Rajat Patidar leaving the best in the business awestruck 😳❤️ Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/5BFUDFTHH1 — IndianPremierLeague (@IPL) May 26, 2026 చదవండి: ‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్‌ను గెలిపించింది వాళ్లే!’ హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు) ‘సిస్టమ్’ మేకింగ్ ఫోటోలను షేర్ చేసిన జ్యోతిక (ఫొటోలు) పలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవి (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు (ఫొటోలు) మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ 15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్