
పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య కొనసాగుతోన్న శాంతి చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. పాక్ మధ్యవర్తిత్వం వహించడమే పెద్ద సమస్య అంటూ ఆయన విమర్శలు చేశారు. ఇరాన్‌తో శాంతిచర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇజ్రాయెల్‌తో వైరం నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) దీన్ని తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే లిండ్సే (Lindsey Graham) పాక్ వ్యవహారంపై విరుచుకుపడుతూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పాక్ మధ్యవర్తిగా వ్యవహరించడమే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ (Israel)పై సుదీర్ఘకాలంగా అది విద్వేషంతో రగిలిపోతుందన్నారు. టెల్‌అవీవ్‌కు వ్యతిరేకంగా గతంలో పాక్ (Pakistan) ఉన్నతస్థాయి అధికారులు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని ఖవాజా చేసిన వ్యాఖ్యలను లిండ్సే ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు తనను భయాందోళనకు గురిచేశాయన్నారు. అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపుపై పాక్ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల అమెరికాతో ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ తన సైనిక విమానాలను పాక్ ఎయిర్‌బేస్‌లలో పార్క్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని లిండ్సే తన పోస్టులో ప్రస్తావిస్తూ.. ఈ విషయం అబద్ధమని కొట్టిపారేయలేమన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.