
నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందులోనూ బాదం పప్పులు మరింత ఆరోగ్యప్రదం కూడా. వీటిని ఎవ్వరైనా ధీమాగా తినొచ్చు. బాలింతలు, దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికి మంచిది. అయితే వీటిని నీటిలో నానబెట్టి తింటే మరింత ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . అధ్యయనాలు సైతం ఆ మాట నొక్కి చెబుతున్నాయి. నీటిలో నానబెట్టకుండా గట్టిగా ఉన్న బాదం పప్పులనే తింటే జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో కూడా వివరించారు. బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కీలక ఖనిజాలు ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి కూడా. అందువల్ల వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి లేదా కనీసం ఓ 12 గంటలైన నానబెట్టి తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఆదర్శగౌడ. ఎందుకంటే.. పచ్చిగా ఉండే బాదం పప్పుల్లో ఫైటిక్ ఆమ్లం ఉంటుందట. ఇది బాదంలో సహజంగా లభించే సమ్మేళనం. ఇది బాదంలోని జింక్, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలతో బంధం ఏర్పరచుకుని కరగని సమ్మేళనాలను ఏర్పరస్తుంది. ఎప్పుడైతే నానబెట్టకుండా తింటామో..ఫలితంగా జీర్ణవ్యవస్థ గుండా శోషించబడకుండానే ప్రయాణిస్తుందట. ఎప్పుడైతే మనం బాదం పప్పులను 12 గంటల పాటు నానాబెడితే..ఫైటిక్ ఆమ్లం పరిమాణం 50 శాతం వరకు గణనీయంగా తగ్గుతుందట. తద్వారా బంధింపబడే ఉండే ఖనిజాల లభ్యత సులభం అవుతుందట. అంటే నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లంలో గట్టిగా బంధిపబడి ఉన్న కీలకమైన ఖనిజాలన్ని శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇలా నానబెట్టడం శరీరానికి కావాల్సిన ఇనుము సులభంగా అందుతుందని పరిశోధనల్లో తేలింది. నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు, ఖనిజాలను సులభంగా శోషించుకునే శాతం మెరుగ్గా May 27 2026 8:45 AM | Updated on May 27 2026 9:00 AM నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు, ఖనిజాలను సులభంగా శోషించుకునే శాతం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేగాదు నానబెట్టడం వల్ల గింజలు ఉత్తేజితమై..మెలకెత్తే ప్రక్రియను ప్రారంభించే ఎంజైములు సైతం యాక్టివ్ అవుతాయట. దీని వల్ల బి విటమిన్ పరిమాణం పెరుగుతుందట. అంటే ఇలా అన్ని గంటల పాటు నానడం వల్ల బాదం పప్పులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు నేరుగా అందేలా సులభంగా జీర్ణం అవుతుంది. పైగా మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. అదే అలానే బాదం పప్పులు గట్టిగానే తినేస్తే..శరీరం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బందిపడటమే కాకుండా..దానిలో ఉన్న ప్రోటీన్లు మన శరీరానికి అందవని, పైగా ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమారు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టే సమయం పెరిగే కొద్ది ఎంజైమ్ క్రియాశీలత, పోషకాల లభ్యత క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. నానబెట్టిన తర్వాత పూర్తిగా కడగడం వల్ల ఎంజైమ్‌ల నిరోధకం అయిన ఫైటిక్ అమ్లం పూర్తిగా తొలిగిపోతుందని చెబుతున్నారు. కాబట్టి నానబెట్టే బాదం గింజలు తినడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. (చదవండి: ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?) ఎలిమినేటర్ పోరు.. నితీశ్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు) ‘సిస్టమ్’ మేకింగ్ ఫోటోలను షేర్ చేసిన జ్యోతిక (ఫొటోలు) పలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవి (ఫొటోలు) మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ 15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్