
విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ, మే 27 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా భావించిన అధికారులు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఇప్పటికే ఎన్ఐఏ అధికారులకు లేఖ రాశారు. అయితే, విశాఖపట్నంలోని ఎన్ఐఏ అధికారులు ఈ టెర్రర్ లింక్స్ కేసుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ కేసును టేకోవర్ చేసి సంబంధిత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తుల కాల్ డేటా, ఆన్లైన్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు, ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులకు ఇంకా ఎవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణతో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి Home » Andhra Pradesh » Krishna » Vijayawada Terror Links Case Handed Over to NIA by NTR District Police ABN , Publish Date - May 27 , 2026 | 09:19 AM Read Latest AP News And Telangana News And International News And Telugu News