
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం పాటీదార్ మాట్లాడాడు. తాను వికెట్ గురించి పట్టించుకోనని, బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. ‘‘ఇది మాకు ఒక అద్భుతమైన మ్యాచ్. మా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో దూకుడుగా ఆడటం మాకు బాగా ఉపయోగపడింది. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాలనే కచ్చితమైన ప్రణాళికతో రాలేదు. కానీ, మేం దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ‘మేం అటాకింగ్ గేమ్ ఆడబోతున్నామని మా బాడీ లాంగ్వేజ్‌తో వారికి తెలియజేయాలి. అది ప్రతి బ్యాటర్‌లోనూ కనిపించిందని నేను అనుకుంటున్నాను. మేం జట్టు సమావేశంలో దీని గురించి చర్చించుకున్నాం. ఇది చాలా కీలకమైన దశ. ఈ మ్యాచ్‌లో మేం ఆడిన తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. నా బ్యాటింగ్ శైలి జట్టులోని మిగతా వారి శైలికి దాదాపు సమానంగానే ఉంటుందని నేను భావిస్తాను. ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్ ఎలా స్పందిస్తోందోనని గమనించడానికి 8 నుంచి 10 బంతులు నెమ్మదిగా ఆడతా. ఆ తర్వాత నేను ఎలా ముందుకుసాగాలనే విషయంపై నాకు పూర్తి స్పష్టత లభిస్తుంది. అప్పుడు నా వికెట్ గురించి నేను అస్సలు ఆందోళన చెందను. బౌలర్‌పై ఒత్తిడి పెంచడాన్ని ఇష్టపడతాను. గిల్, సుదర్శన్, బట్లర్‌ను పవర్ ప్లేలో ఔట్ చేయాలనుకున్నాం. ఆ ప్లాన్ సక్సెస్ అయింది’’ అని రజత్ పాటీదార్ వివరించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.