
తన జీవితంలో మే 23వ తేదీ ఎప్పటికీ ప్రత్యేకమేనని కథానాయకుడు నాగార్జున అన్నారు. అందులోనూ ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమని తెలిపారు. ఆయన తొలి సినిమా ‘విక్రమ్’ విడుదలై శనివారంతో 40ఏళ్లు అయిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన జీవితంలో మే 23వ తేదీ ఎప్పటికీ ప్రత్యేకమేనని కథానాయకుడు నాగార్జున అన్నారు. అందులోనూ ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమని తెలిపారు. ఆయన తొలి సినిమా ‘విక్రమ్’ విడుదలై శనివారంతో 40ఏళ్లు అయిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మే 23.. నేనెప్పటికి మర్చిపోలేను. మా నాన్న చివరి సినిమా ‘మనం’ 2014లో ఈరోజే విడుదలైంది. నాన్నతో పాటు నాగచైతన్య, అఖిల్‌తో నటించే అవకాశం ఆ చిత్రంతోనే దక్కింది. ఇక 40ఏళ్ల క్రితం ఇదే రోజు నా తొలి సినిమా ‘విక్రమ్’ విడుదలైంది. అందర్నీ అలరించడం కోసం.. అందరి ప్రేమాభిమానాల్ని పొందడం కోసం నేనిక్కడికి వచ్చా. ‘విక్రమ్’ నాకెంతో మంది అభిమానుల్ని దగ్గర చేసింది. ఇన్నేళ్లు అండగా నిలిచిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని మే 23లను ఇలాగే వేడుక చేసుకోవాలని కోరుకుంటున్నా’’ అని నాగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రా.కార్తీక్ దర్శకత్వంలో ‘కింగ్ 100’లో నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending