
ఏఐ సహాయంతో అసభ్యకర రీతిలో తన ఫొటోలను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ కథానాయిక రుక్మిణీ వసంత్. వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించి ఇలాంటి ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానిస్తూ ఎక్స్ వేదికగా ఓ నోట్‌ని విడుదల చేశారు. ‘‘ఏఐ ఉపయోగించి సృష్టించిన నా ఫొటోలను ఆన్లైన్లో వైరల్ చేయడాన్ని నేను, నా టీమ్ గమనించాము. ఏఐ సహాయంతో అసభ్యకర రీతిలో తన ఫొటోలను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ కథానాయిక రుక్మిణీ వసంత్. వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించి ఇలాంటి ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానిస్తూ ఎక్స్ వేదికగా ఓ నోట్‌ని విడుదల చేశారు. ‘‘ఏఐ ఉపయోగించి సృష్టించిన నా ఫొటోలను ఆన్లైన్లో వైరల్ చేయడాన్ని నేను, నా టీమ్ గమనించాము. అవన్నీ ఫేక్. ఏఐతో చేసినవి అని స్పష్టం చేయదలుచుకున్నా. ఇలాంటి ఫొటోలు, కంటెంట్‌ని సృష్టించి ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం. ఈ వ్యవహారాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఫొటోలు క్రియేట్ చేసిన వారితో పాటు, ఆన్లైన్ వేదికగా వైరల్ చేస్తున్న వారిపైనా న్యాయపరంగా, సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు ప్రారంభించాం. ఇలాంటి కంటెంట్, ఫొటోలను ఆన్లైన్లో పంచుకోవడం మానుకోవాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అందులో పేర్కొన్నారు. రుక్మిణి స్విమ్మింగ్ పూల్ వద్ద ఫొటోషూట్ చేయించుకుంటున్నట్లు ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలు వైరలవడంతో దీనిపై రుక్మిణీ తాజాగా స్పందిస్తూ ఫేక్ అని స్పష్టం చేశారు. సినిమా, పబ్లిక్ ఈవెంట్స్‌కు హాజరయ్యే నటీమణులను అభ్యంతరకర రీతిలో జూమ్ చేసి ఫొటోలు తీయడంపై రుక్మిణి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending