
‘‘ఇన్నేళ్లు నేను పడిన కష్టంతో పోలిస్తే.. ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో నటుడిగా చాలా బాగా పేరొచ్చింది’’ అన్నారు హీరో నందు. అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమాని ప్రణవ స్వరూప్ తెరకెక్కించారు. ‘‘ఇన్నేళ్లు నేను పడిన కష్టంతో పోలిస్తే.. ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో నటుడిగా చాలా బాగా పేరొచ్చింది’’ అన్నారు హీరో నందు. ఆయన.. అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమాని ప్రణవ స్వరూప్ తెరకెక్కించారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మించారు. శివాజీ రాజా, రవితేజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో థాంక్స్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇందులోని కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు మేమూ ఇబ్బంది పడ్డాం. కానీ, సినిమా కోసమే తప్పక చేశాం. ఈ చిత్రంతో నటుడిగా నాకు మంచి పేరొస్తుందని ముందే అనుకున్నా. ప్రస్తుతం అమ్మాయిలు గతంతో పోలిస్తే బలంగా ఉంటున్నారు. భర్త క్రూరంగా ఉంటే భార్యకు అతడ్ని భరించాల్సిన అవసరం లేదు. ఇకపై నా రానున్న చిత్రాలు కుటుంబ సమేతంగా చూడగలిగేలా ఉంటాయి’’ అన్నారు. ‘ప్రేమ అనేది మారుతుంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో కొంతమంది తప్పక అలా ఉండిపోతారు. అదే ఈ చిత్రంతో చెప్పాలనుకున్నా’’ అన్నారు దర్శకుడు ప్రణవ స్వరూప్. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending