
అమరావతి: తెదేపా పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు (Chandrababu) తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (Nara Lokesh), పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుండి వేలాదిమంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్లైన్లోనే విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.