
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Manoj Gave Life To Physically Challenged Person: మంచు మనోజ్ సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. తాజాగా మంచు మనోజ్.. మానసిక స్థితి బాగాలేని సంతోష్ అనే వ్యక్తి బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశాడు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి "సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించడం అక్కడ ఉన్నవారు కూడా పులకించిపోయారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ* .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్, సామాజిక మాధ్యమం ద్వారా మొదట తనను సంప్రదించినట్టు తెలిపారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా పనుల కారణంగా బిజీగా ఉన్నాను. అయితే గిరి చేసిన రిక్వెస్ట్, పెట్టిన వీడియో మాత్రం మదిలో అలా మెదులుతూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని, కాస్త విరామం దొరికిన తరువాత వెంటనే మళ్లీ నేనే వీరిని కలిసాను వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నానన్నారు. మానసిక స్థితి సరిగ్గా లేని నిరాశ్రయుల పరిస్థితి గురించి భావోద్వేగంతో మాట్లాడుతూ.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కనీసం అప్పుడప్పుడు మద్దతు, గుర్తింపు లభిస్తున్నప్పటికీ, ఇలా మానసిక స్థితి సరిగ్గా లేని వారిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. దాదాపు అందరూ విస్మరిస్తూనే ఉంటారని మనోజ్ అన్నారు. ఈ రోజుకీ చాలా మంది ఇలాంటి వారిని అంటరానివారిలా చూస్తున్నారు. మనం 2026లో జీవిస్తున్నాం. మన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. గొప్ప వైద్యులు, కావాల్సినంత జ్ఞానం, సరిపడా వనరులు ఉన్నాయని గుర్తు చేశారు. అయినా కూడా మనం వారిని అలానే రోడ్ల మీదే వదిలేసి వెళ్లిపోవడం బాధకరం అన్నారు. నాలాంటి సెలబ్రిటీలు కాకుండా మంచి పొజిషిన్ ఉన్న వారు ఇలాంటి వారి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘మాతృదేవోభవ’ నిర్వాహకుడు గిరి మాట్లాడుతూ.. మంచు మనోజ్ అందించిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి వాళ్లు సమాజంలో చాలా మంది ముందుకు వస్తే బాగుంటుందని కోరుకున్నారు. ఈ విధంగా ఆశ్రమాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, సమయం గడిపిన మొదటి సినీ నటుడు మనోజ్ అనే అభినందించారు. సమాజం చేత విస్మరించబడిన ప్రజల పట్ల మద్దతు, కరుణ, గుర్తింపును చూపినందుకు మనోజ్ కి, అతని కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసారు. మరోవైపు ‘ఎదుటి వారి బాధను చూసి కూడా మౌనంగా ఉండిపోయేవారే నిజంగా మానసిక స్థితి లేనివారన్నారు. కేవలం ముప్పై నిమిషాల్లోనే ఒక వ్యక్తి నెమ్మదిగా తన గౌరవాన్ని, రూపాన్ని తిరిగి ఎలా పొందుతాడో మీరు చూశారన్నారు. సంతోష్ ఎప్పటికైనా తన కుటుంబంతో తిరిగి కలుస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నన్నారు. మంచు మనోజ్.. తన భార్యతో కలిసి ‘ఐక్య’ ఫౌండేషన్ స్థాపించి తనకు తోచిన సాయం అందిస్తున్నారు. మంచు మనోజ్.. సినిమాల విషయానికొస్తే..లాస్ట్ ఇయర్ ‘మిరాయ్’ సినిమాతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అంతేకాదు బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. అంతేకాదు ‘వడ్డీ కాసుల వాడు’, డేవిడ్ రెడ్డి, రక్షక్ వంటి సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. Also Read:Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన టాప్ డిజాస్టర్ చిత్రాలు ఇవే.. Also Read: Jr NTR Top Movies: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ చిత్రాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.