
ఇలాంటి పెళ్లిని ఇంతకు ముందెన్నడూ కనివిని ఎరుగరు అంటూ తాను ఇష్టపడిన బానీ అనే అమ్మాయిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు జస్. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ జంట మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రీత్ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు జస్. ఇలాంటి పెళ్లిని ఇంతకు ముందెన్నడూ కనివిని ఎరుగరు అంటూ తాను ఇష్టపడిన బానీ అనే అమ్మాయిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు జస్. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ జంట మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రీత్ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు జస్. వీరి పయనం సరదాగా సాగిపోతున్న తరుణంలో తాను గర్భవతినంటూ జస్ జీవితంలోకి మళ్లీ తన భార్య వచ్చేస్తుంది. ఓ వైపు భార్య మరోవైపు ప్రేయసి... ఇద్దరూ ప్రెగ్నెంట్లు అవ్వడంతో ఇరకాటంలో పడిన జస్ కథ చివరికి ఏమైందో తెలియాలంటే ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రం చూడాల్సిందే. ఈ సినిమాలో ఇద్దరు బిడ్డలకు తండ్రి కాబోతున్న జస్ పాత్రలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కనిపించనున్నాడు. కథానాయికలు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే.. బానీ, ప్రీత్లుగా అలరించనున్నారు. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రమేశ్ తౌరనీ నిర్మించారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్ను పంచుకుంది. ‘ప్రీత్ ఇక్కడ.. బానీ అక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి’ లాంటి సంభాషణలు, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఆకట్టుకుంటుందీ ట్రైలర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మౌనీరాయ్, మనీష్ పాల్, చుంకీ పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending