
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ విప్లవం కారణంగా డేటా కేంద్రాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలకు పెద్ద మొత్తంలో మెమొరీ చిప్‌లు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ (Samsung) చిప్ విభాగం భారీ వృద్ధిని సాధిస్తోంది. తమ మెమొరీ చిప్‌లకు భారీ డిమాండ్ రావడంతో ఉద్యోగులకు జాక్‌పాట్ తగిలింది. గత త్రైమాసికంలో తమ ఆదాయం 49 రెట్లు పెరగడంతో ఒక్కో ఉద్యోగికి రూ.3.25 కోట్ల బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ బోనస్ మంజూరుకు అనుకూలంగా బోర్డు ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో శామ్సంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులు కోటీశ్వరులు కానున్నారు. కంపెనీకి వస్తున్న లాభాలే కాకుండా.. చిప్ విభాగం (Samsungs chip division) ఉద్యోగులు ఇటీవల చేపట్టిన సమ్మె కూడా ఈ బోనస్ ప్రకటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ‘పనితీరు ఆధారిత బోనస్’, జీతాల పెంపు వంటి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 18 రోజుల పాటు సమ్మె చేస్తామని ఇటీవల శామ్సంగ్ చిప్ విభాగం ఉద్యోగులు స్పష్టంచేశారు. అయితే సెమీకండక్టర్ తయారీలో ఒక్క రోజు సమ్మె జరిగినా కంపెనీకి రూ.కోట్లలో నష్టం వస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో సమ్మె నివారించడానికి ఉద్యోగుల సంఘంతో కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఫలితంగానే చిప్ విభాగంలోని 78వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల భారీ బోనస్ ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన మెమొరీ చిప్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్ కూడా గతేడాది తమ కంపెనీకి పెరిగిన డిమాండ్ ఆధారంగా ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఇదీ చదవండి: ఏఐ వల్ల ‘ఉద్యోగాల వినాశనం’ రాదు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.