
ఇంటర్నెట్‌డెస్క్: ఈ సరికొత్త టెక్ యుగంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) నిపుణులకు భారీ డిమాండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ దేశ నైపుణ్యం ఇతరుల చేతికి చిక్కుకుండా చైనా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ఏఐ నిపుణులు దేశం దాటొద్దంటూ నిషేధం విధించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, డీప్‌సీక్ వంటి సంస్థలకు చెందిన అగ్రశ్రేణి ఏఐ నిపుణుల (AI talent) విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. తన సాంకేతికతను పరిరక్షించుకునేందుకు, ఈ రంగంలో అమెరికాను అధిగమించే క్రమంలో వారిని వ్యూహాత్మక ఆస్తులుగా పరిగణిస్తూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆ నిపుణులు విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే.. సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా ఈతరహా ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి కాదు. కళాశాల పరిశోధకులు, అణుశాస్త్రవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కీలక అధికారులు దేశం దాటే విషయంలో కొన్నేళ్లుగా ఆంక్షలు అమలుచేస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఏఐ రంగాన్ని చేర్చింది. అయితే చైనా (China) ప్రభుత్వం అతి జోక్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏఐ స్టార్టప్ మానుస్‌ను రెండు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మెటా సంస్థ ముందుకురాగా.. ఆ ప్రక్రియను ఆ దేశ నియంత్రణ సంస్థలు నిరోధించాయి. తమ సాంకేతికత, టాలెంట్ దేశం దాటకుండా చూసేందుకే ఈ డీల్‌ను అడ్డుకున్నాయి. అలాగే మానుస్ సహ వ్యవస్థాపకుల్లో ఇద్దరిని దేశం విడిచివెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ సంస్థల్లో పనిచేయాలనే లక్ష్యంతో ఉండే యువ ఇంజినీర్లపై ఈ చర్యలు ప్రభావం చూపించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభుత్వం నుంచి కానీ.. కంపెనీల ఇప్పుడు ఆ జాబితాలోకి ఏఐ రంగాన్ని చేర్చింది. అయితే చైనా (China) ప్రభుత్వం అతి జోక్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏఐ స్టార్టప్ మానుస్‌ను రెండు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మెటా సంస్థ ముందుకురాగా.. ఆ ప్రక్రియను ఆ దేశ నియంత్రణ సంస్థలు నిరోధించాయి. తమ సాంకేతికత, టాలెంట్ దేశం దాటకుండా చూసేందుకే ఈ డీల్‌ను అడ్డుకున్నాయి. అలాగే మానుస్ సహ వ్యవస్థాపకుల్లో ఇద్దరిని దేశం విడిచివెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ సంస్థల్లో పనిచేయాలనే లక్ష్యంతో ఉండే యువ ఇంజినీర్లపై ఈ చర్యలు ప్రభావం చూపించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభుత్వం నుంచి కానీ.. కంపెనీల నుంచి కానీ ఎలాంటి స్పందనా రాలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.