
ఇంటర్నెట్‌డెస్క్: మాదకద్రవ్యాల రవాణాపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. తాజాగా గుజరాత్ (Gujarat)లోని కచ్ తీరంలో భారీ మొత్తంలో కొకైన్ దొరికింది. దాని విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పాకిస్థాన్‌లోని ఖాసిం పోర్టు నుంచి ఒక యూరోపియన్ నౌక కచ్ తీరానికి వచ్చింది. ఈ నౌకలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), భారత కోస్ట్‌గార్డ్ అధికారులు గమనించారు. నౌకలోంచి కొన్ని సంచులను సముద్రంలోకి విసిరేయడాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ సంచులను స్వాధీనం చేసుకొని.. పరీక్షించగా అవి కొకైన్ (cocaine) అని తేలింది. దాదాపు 100 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1150 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ డ్రగ్స్ (Drugs) రవాణాకు సంబంధించి ఒకరిని అధికారులు అరెస్టు చేశారు. నౌకన్ను సీజ్ చేసి తీర ప్రాంతానికి తరలించారు. ఈ డ్రగ్స్ ఎక్కడినుంచి వచ్చాయి, ఎక్కడికి చేరవేస్తున్నారు.. ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.