
JIO OTT pass | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (JIO) సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే యూజర్లే లక్ష్యంగా జియో ఓటీటీ పాస్‌ను (JIO OTT pass) తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు, జియో టీవీలో వెయ్యికి పైగా ఛానళ్లు, 30 జీబీ హైస్పీడ్ డేటాతో ఈ ప్లాన్ లభిస్తుంది. ఈ పాస్ ధరను రూ.200గా కంపెనీ నిర్ణయించింది. మే 27 నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్లాన్ ద్వారా రూ.1500 విలువైన ప్రయోజనాలను కేవలం రూ.200కే అందిస్తున్నట్లు జియో వెల్లడించింది. ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేకుండా, బ్యాక్ గ్రౌండ్ప్లే చేస్తూ యూట్యూబ్ ప్రీమియంను యాక్సెస్ చేయొచ్చు. దీంతో పాటు లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ కంటెంట్‌తో జియోహాట్‌స్టార్ మొబైల్+ హాలీవుడ్ యాక్సెస్‌ను అందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కూడా ఈ ప్యాక్‌లో భాగంగా లభిస్తుంది. జియో టీవీ ద్వారా సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్నెక్స్ట్, ఫ్యాన్‌కోడ్, హోయ్‌చోయ్, చౌపల్, ప్లానెట్ మరాఠీ, తరంగ్ ప్లస్, టైమ్స్ ప్లే వంటి మరో 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయొచ్చు. సబ్స్క్రైబర్లు జియో టీవీ ద్వారా వెయ్యికి పైగా లైవ్‌టీవీ ఛానళ్లు కూడా చూడొచ్చు. ఇందులో ప్రముఖ బ్రాడ్కాస్టర్లకు చెందిన 150కు పైగా పెయిడ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. జియోస్టార్, సన్‌టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, ఈటీవీకి చెందిన ప్రాంతీయ వినోద, సినిమా ఛానళ్లు వీక్షించొచ్చు. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్నవారు ఈ ప్లాన్ తీసుకుంటే జియో టీవీ ద్వారా సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్నెక్స్ట్, ఫ్యాన్‌కోడ్, హోయ్‌చోయ్, చౌపల్, ప్లానెట్ మరాఠీ, తరంగ్ ప్లస్, టైమ్స్ ప్లే వంటి మరో 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయొచ్చు. సబ్స్క్రైబర్లు జియో టీవీ ద్వారా వెయ్యికి పైగా లైవ్‌టీవీ ఛానళ్లు కూడా చూడొచ్చు. ఇందులో ప్రముఖ బ్రాడ్కాస్టర్లకు చెందిన 150కు పైగా పెయిడ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. జియోస్టార్, సన్‌టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, ఈటీవీకి చెందిన ప్రాంతీయ వినోద, సినిమా ఛానళ్లు వీక్షించొచ్చు. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్నవారు ఈ ప్లాన్ తీసుకుంటే 30జీబీ 4జీ/5జీ డేటాతో పాటు, అపరిమిత 5జీ డేటాను కూడా వినియోగించుకోవచ్చు. మైజియో యాప్, జియో.కామ్ వెబ్సైట్, థర్డ్‌పార్టీ రీఛార్జి యాప్‌లలో ఈ ప్లాన్ అన్ని టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.