
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan fires on ap cm Chandrababu naidu govt in tadepalli ysrcp party meeting: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకవైపు టీడీపీ శ్రేణులు మహానాడు సంబరాలను చేసుకుంటుంది. మరోవైపు వైసీపీ నేతలు తాడే పల్లిలో కార్యకర్తలు, శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ విస్తృత స్థాయి నిర్వహించారు. దీనికి ఏపీ వ్యాప్తంగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు హజరయ్యారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కూటమి రెండెళ్ల పాలనపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూటమి ఎన్నికల వేళ ఇచ్చిన హమీలపై వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అడ్రస్ లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండెళ్ల కాలంలో ఏపీ ప్రజలకు ఏంచేయలేదు కాబట్టి .. డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారన్నారు. గొడ్డళ్లు కత్తులు, కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను పిచ్చోళ్లని అనుకుంటున్నారని కానీ వాళ్లు చాలా తెలివైన వాళ్లని అన్నారు. వైఎస్సార్, వైఎస్సార్సీపీ పాలనలోనే జనాలకు చాలా మేలు జరిగిందని వైఎస్ జగన్ ముఖ్యంగా కూటమి ఎన్నికల వేళ ఇచ్చిన హమీలపై వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అడ్రస్ లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండెళ్ల కాలంలో ఏపీ ప్రజలకు ఏంచేయలేదు కాబట్టి .. డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారన్నారు. గొడ్డళ్లు కత్తులు, కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను పిచ్చోళ్లని అనుకుంటున్నారని కానీ వాళ్లు చాలా తెలివైన వాళ్లని అన్నారు. వైఎస్సార్, వైఎస్సార్సీపీ పాలనలోనే జనాలకు చాలా మేలు జరిగిందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగా వెన్నుపోటుకు రెండెళ్లు అనే బుక్ లెట్ ఆవిష్కరించారు. వెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్లెట్ ఆవిష్కరణ సీఎం చంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లని తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలకు దిగిందన్నారు. చంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ విడుదల చేశామన్నారు. చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించామని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించమని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. జూన్ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించేలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూన్ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు, జూన్ 8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్ టౌన్హాల్లో సదస్సులు నిర్వహించాలన్నారు. అదే విధంగా జూన్ 12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు చేపట్టాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత, సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్ రూపొందించినట్లు వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా కార్యక్రమాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ల ధరలు తగ్గించకపొగా రేట్లు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పన్నుులు తగ్గించి ప్రజలపై భారంలేకుండా చూడొచ్చు కదా అని కూటమి ప్రభుత్వంకు డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పథకాలు అమలు చేయలేదన్నారు. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవన్నారు. అంతే కాకుండా.. 18 ఏళ్లు నిండిన అక్క చెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారన్నారు. ప్రశ్నిస్తే ఏపీ సీఎం చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోందన్నారు. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారన్నారు. అంతే కాకుండా టీడీపీ చేపట్టిన డిజిటల్ మహనాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. టీడీపీ మహానాడు లో పాల్గొనేందుకు క్యాడర్ ఆసక్తి చూపలేదన్నారు. నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా డిజిటల్ మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మహానాడులో కార్యకర్తలు రాక స్థానిక టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. Read more: K Nageshwar Arrest Rumours: